Dil Raju- Vijay: నైజాం ప్రాంతం లో ఒక చిన్న డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ని ఆరంభించి అంచలంచలుగా ఎదుగుతూ ఆ తర్వాత నిర్మాతగా మారి టాలీవుడ్ లో ప్రతీ స్టార్ హీరో తో సినిమాల మీద సినిమాలు చేసి తిరుగులేని నిర్మాతగా మారిన వ్యక్తి దిల్ రాజు..నేడు ఇండస్ట్రీ లో ఈయన నెంబర్ 1 నిర్మాత..స్టార్ హీరోలతో పాటుగా కుర్రహీరోలతో కూడా ఆయన సినిమాలు తీస్తూ ఉంటాడు..కేవలం నిర్మాతగా మాత్రమే కాదు..డిస్ట్రిబ్యూషన్ రంగం లో కూడా దిల్ రాజుదే హవా.

ఈమధ్య ఆయన ద్రుష్టి కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితం కాకుండా బాలీవుడ్ మరియు కోలీవుడ్ మీద కూడా పడింది..బాలీవుడ్ లో ఇదివరకే పలు సినిమాలను నిర్మించి చేతులు కాల్చుకున్న దిల్ రాజు..ఇప్పుడు కోలీవుడ్ లో ఎలా అయినా గ్రాండ్ హిట్ తో ఎంట్రీ ఇవ్వాలని తమిళ స్టార్ హీరో విజయ్ తో ‘వారిసు’ అనే సినిమాని తీసాడు..మన టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
ఇటీవలే విడుదల చేసిన రెండు పాటలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..అలా ట్రేడ్ లో ఫుల్ పాజిటివ్ బజ్ ని ఏర్పర్చుకున్న ఈ చిత్రం జనవరి 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతుంది..అదే రోజు మరో స్టార్ హీరో అజిత్ నటించిన ‘తునీవు’ చిత్రం కూడా విడుదల అవుతుంది..సుమారు పదేళ్ల తర్వాత విజయ్ మరియు అజిత్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడుతున్నాయి..ఈ సందర్భంగా ఇటీవల దిల్ రాజు ఒక ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ వివాదాలకు దారి తీసింది.

ఆయన మాట్లాడుతూ ‘తమిళం లో ప్రస్తుతం విజయ్ నెంబర్ 1 హీరో ..అజిత్ కంటే పెద్ద హీరో..అలాంటి హీరోకి థియేటర్స్ కొరత పడింది..రేపు చెన్నై కి వెళ్తున్నాను..రెడ్ జెయింట్ సంస్థ అధినేత ఉదయనిధి స్టాలిన్ తో చర్చలు జరిపి మా సినిమాకి అదనంగా ఒక 50 థియేటర్స్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను’ అంటూ కామెంట్ చేసాడు..దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్ పై అజిత్ ఫ్యాన్స్ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు..ఇప్పుడు విజయ్ నెంబర్ 1 హీరో అని చెప్పావ్..రేపు మా అజిత్ తో సినిమా తీస్తే అజిత్ నెంబర్ 1 అని చెప్తావా అంటూ దిల్ రాజు ని ఏకిపారేస్తున్నారు అజిత్ ఫ్యాన్స్.