https://oktelugu.com/

‘Liger’Memes : ‘పూరి’‘కొండన్నా’ ఏంటన్నా ఇదీ.. లైగర్ ఫ్లాప్ పై హోరెత్తుతున్న మీమ్స్..

‘Liger’Memes హిట్ అయితే నెత్తినపెట్టుకోవడం.. ఫ్లాప్అయితే బజారున బండ కేసి కొట్టడం అభిమానులకు అలవాటు. పుష్ప లాంటి క్లాసిక్ మూవీ చూసి అందులోని డైలాగ్ ‘తగ్గేదేలే’ ను అన్వయించుకొని సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ హంగామా చేశారు. ఇప్పుడు ‘లైగర్’కు నెగెటివ్ టాక్ రాగానే అందులోని లూప్ హోల్స్ పై విరుచుకుపడుతున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో రిలీజ్ అయిన ‘లైగర్’ మూవీపై బోలెడు అంచనాలు ఏర్పడ్డాయి. చిత్రం యూనిట్ కూడా […]

Written By:
  • NARESH
  • , Updated On : August 26, 2022 / 06:44 PM IST
    Follow us on

    ‘Liger’Memes హిట్ అయితే నెత్తినపెట్టుకోవడం.. ఫ్లాప్అయితే బజారున బండ కేసి కొట్టడం అభిమానులకు అలవాటు. పుష్ప లాంటి క్లాసిక్ మూవీ చూసి అందులోని డైలాగ్ ‘తగ్గేదేలే’ ను అన్వయించుకొని సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ హంగామా చేశారు. ఇప్పుడు ‘లైగర్’కు నెగెటివ్ టాక్ రాగానే అందులోని లూప్ హోల్స్ పై విరుచుకుపడుతున్నారు.

    పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో రిలీజ్ అయిన ‘లైగర్’ మూవీపై బోలెడు అంచనాలు ఏర్పడ్డాయి. చిత్రం యూనిట్ కూడా దేశమంతా తిరిగి బాగా ప్రచారం చేసింది. విజయ్ లాంటి యంగ్ చార్మింగ్ హీరోకు ఫ్యాన్స్ కూడా బ్రహ్మరథం పట్టారు.

    రిలీజ్ కు ముందే మైక్ టైసన్ లాంటి బాహుబలిని పట్టుకొచ్చి సినిమాలో నటింపచేయడంతో అందరూ ఎంతో ఊహించుకున్నారు. కానీ కట్ చేస్తే సినిమాలో కథ సరిగా లేకపోవడం.. ప్రజెంటేషన్ మిస్ కావడం…కనీసం పూరి మార్క్ లేకపోవడంతో అందరూ డీలా పడ్డారు. ‘ఏంటీ బ్రో’ అంటూసోషల్ మీడియాలో ఇప్పుడు ట్రోలింగ్ మొదలుపెట్టారు.

    సోషల్ మీడియాలో లైగర్ ఫ్లాప్ పై మీమ్స్ వెల్లువెత్తాయి. ఒక్కొక్కరూ ఒక్కో రకంగా తమ అసంతృప్తిని మీమ్స్ ద్వారా బయటపెట్టారు. అవి చూడడానికి నవ్వులు తెప్పించేలా ఉన్నాయి. లైగర్ టీం ఎంతో ఊహించుకున్న ఈ సినిమా ఇలా బిస్కట్ కావడంతో.. నెటిజన్లు సైతం దానిలోని లోపాలను వెతికి మరీ మీమ్స్ చేశారు. అవిప్పుడు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నాయి. ఆ మీమ్స్ మీరూ చూసి ఎంజాయ్ చేయండి..