Sukumar Vijay Deverakonda: సుకుమార్ కి విజయ్ దేవరకొండ చేసిన మెసేజ్ వైరల్ !

Sukumar Vijay Deverakonda: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కలయికలో సినిమా వస్తోంది అనగానే.. అదిరిపోయే కాంబినేషన్ సెట్ చేశారు అంటూ చాలా పాజిటివ్ కామెంట్స్ వినిపించాయి. అయితే, ఆ తర్వాత వీళ్ళ సినిమా పై ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. అసలు వీళ్ళ సినిమా ఉందా ? లేదా ? అనే డౌట్ కూడా వచ్చింది. అయితే, ఈ రౌడీ హీరో తన తర్వాత సినిమా.. స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ […]

Written By: Shiva, Updated On : January 12, 2022 3:33 pm
Follow us on

Sukumar Vijay Deverakonda: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కలయికలో సినిమా వస్తోంది అనగానే.. అదిరిపోయే కాంబినేషన్ సెట్ చేశారు అంటూ చాలా పాజిటివ్ కామెంట్స్ వినిపించాయి. అయితే, ఆ తర్వాత వీళ్ళ సినిమా పై ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. అసలు వీళ్ళ సినిమా ఉందా ? లేదా ? అనే డౌట్ కూడా వచ్చింది. అయితే, ఈ రౌడీ హీరో తన తర్వాత సినిమా.. స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ తోనే ఉంటుందని చిన్న హింట్ ఇస్తూ ఒక ట్వీట్ చేశాడు. అయితే, ఇది తాజాగా వైరల్ అవుతుంది.

Sukumar and Vijay Deverakonda

సుకుమార్ ను ఉద్దేశించి.. విజయ్ దేవరకొండ మెసేజ్ చేస్తూ.. “మీతో నేను సినిమా చేసేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాను సర్. 2021 ది రైజ్‌, 2022 ది రూల్‌, 2023 ది ర్యాంపేజ్‌” అంటూ విజయ్ దేవరకొండ రాసుకొచ్చాడు. విజయ్‌ దేవరకొండతో సినిమా చేస్తానని సుకుమార్ కూడా రెండేళ్ల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ తనను తాను స్టార్ హీరోగా బాగానే ప్రమోట్ చేసుకుంటున్నాడు.

నిజానికి విజయ్ దేవరకొండ కంటే హీరో నానికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కానీ విజయ్ దేవరకొండ మాత్రం చాలా తెలివిగా తనను తానూ పాన్ ఇండియా స్టార్ గా ప్రమోట్ చేసుకోవడంలో పూర్తి సక్సెస్ అయ్యాడు. స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసి తన మార్కెట్ పరిధిని కూడా రెట్టింపు చేసుకుంటూ ముందుకు పోతున్నాడు ఈ హీరో. అయితే, విజయ్ ది బలుపు కాదు, వాపు అని వాదించే వారు కూడా ఉన్నారు అనుకోండి.

Also Read: ‘సుకుమార్’కి ఉన్న ఈ రికార్డ్స్ మరో దర్శకుడికి లేవు !

ఇక ఈ సెన్సేషనల్ హీరో – క్రియేటివ్ డైరెక్టర్ కలయికలో రానున్న క్రేజీ ప్రాజెక్ట్ తో కేదార్ సెలగంశెట్టి అనే యువ నిర్మాత ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడు. తన సంస్థ ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పుష్ప 2 ఈ ఏడాది వరకు ఉంటుంది. అలాగే సుకుమార్ స్క్రిప్ట్ రాయడానికి ఎంత లేదన్నా ఆరు నెలల టైం తీసుకుంటాడు.

కాబట్టి వీరి సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో మొదలుపెట్టాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమాని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు, మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Also Read: ‘పుష్ప’ కి మరో స్టార్ హీరో ఫిదా.. ఎందుకు అందరూ పుష్ప పై పడ్డారు ?

Tags