Liger Trailer: పూరి జగన్నాథ్ మనసుపెట్టి సినిమా తీయాలే కానీ.. అది ‘పోకిరీ’ లాంటి ఆణిముత్యం అవుతుంది. ఎప్పుడూ మాఫియా గురించే సినిమాలు తీస్తూ మూసలో పడిపోయి పేరు చెడగొట్టుకున్న పూరి ఇప్పుడు క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది… మూడు నెలల్లో సినిమా తీసే ఈ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి దాదాపు మూడేళ్లుగా ఒక సినిమా కోసం వెచ్చించాడంటే అది ఎంత బాగా వస్తుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పవర్ ప్యాక్డ్ మూవీనే ‘లైగర్’. తాజాగా విడుదలైన ‘లైగర్’ ట్రైలర్ ఫుల్ యాక్షన్ తో ఉర్రూతలూగిస్తోంది. విజయ్ దేవరకొండలోని విశ్వరూపాన్ని పూరి ఈ సినిమాలో చూపించాడని అర్థమవుతోంది.
ఒక లయన్ కు, టైగర్ కు పుట్టిన క్రాస్ బ్రీడ్ నా బిడ్డ ‘లైగర్’ అంటూ విజయ్ దేవరకొండను ఆయన తల్లి రమ్యక్రిష్ణ వీరావేశంతో పలికిన డైలాగ్ తో మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫైటింగ్ రింగ్ లోకి ఎంట్రీ ఇస్తాడు. విజయ్ ఈ లైగర్ సినిమాతో హిందీ సహా దేశవ్యాప్తంగా ప్యాన్ఇండియా స్టార్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.
Also Read: Dil Raju- Karthikeya 2: ఆ సీక్వెల్ కి అన్యాయం చేసిన దిల్ రాజు.. ఇది బాధాకరం
తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ లు ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో విడుదల చేయగా.. హిందీ ట్రైలర్ ను రణ్ వీర్ సింగ్, మలయాళ ట్రైలర్ ను దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ లో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ను చూపించారు. లైగర్ గా విజయ్ ఎంత వైల్డ్ గా పోరాడుతున్నాడో.. యాక్షన్ సీన్స్ లో ఎంత బాగా పోరాటం చేశాడో అద్భుతంగా పూర్తి తీర్చిదిద్దాడు. విజయ్ బాక్సింగ్ రింగ్ లోకి ఎంటర్ అవుతున్న విజువల్స్ కేక పుట్టించేలా ఉన్నాయి.
ఇక విజయ్ దేవరకొండ ఫైటర్ కాకముందు గల్లీల్లో తన ప్రతాపాన్ని చూపిస్తున్న యాక్షన్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. లోకల్ ట్రైన్ ఫైట్, అనన్య పాండేతో రోమాన్స్ బాగుంది. ఇక చివర్లో ప్రపంచంలోనే భీకర బాక్సర్ మైక్ టైసన్ ఎంట్రీ అతడితో తలపడే సన్నివేశాలు హైలెట్ అని చెప్పొచ్చు. అక్కడికే ట్రైలర్ కట్ చేయడంతో ఆసక్తి రేపుతోంది.
ఈ ట్రైలర్ లో విజయ్ దేవరకొండ నత్తితో పలకలేకపోతున్న మాడ్యులేషన్ అదిరిపోయింది. ఛాయ్ బండీ వాలా నుంచి బాక్సింగ్ లో వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన తీరు సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. ఒక విధంగా విజయ్ దేవరకొండ ఈ సినిమాతో మరోసారి ‘అర్జున్ రెడ్డి ’ తరహాలో విశ్వరూపం చూపించినట్టు అర్థమవుతోంది. ఈ లైగర్ తో విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా స్టార్ కావడం ఖాయమంటున్నారు.
Also Read:Dil Raju: సినిమా టికెట్ రేట్లపై దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్