Liger Movie Review: రివ్యూ : లైగర్
నటీనటులు: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ తదితరులు
దర్శకుడు: పూరి జగన్నాథ్
నిర్మాతలు: పూరి, ఛార్మి, కరణ్ జోహార్
సినిమాటోగ్రపీ: విష్ణు శర్మ
స్క్రీన్ ప్లే : పూరి జగన్నాథ్
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ

పూరి- విజయ్ దేవరకొండ కలయికలో నేడు రిలీజ్ అయిన చిత్రం ‘లైగర్’. మరి ఈ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ డ్రామా ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో రివ్యూ చూద్దాం..
కథ :
లైగర్ (విజయ్ దేవరకొండ) మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఇంటర్ నేషనల్ ఛాంపియన్ అవ్వాలని కల కంటాడు. దీని కోసం తన తల్లి బాలమణితో (రమ్యకృష్ణ) కలిసి ముంబైకి వస్తాడు. మరి ఛాంపియన్ అవ్వాలనే తన కల కోసం విజయ్ దేవరకొండ ఏం చేశాడు ?, అతని తల్లి బాలమణి అతనికి ఎలా ప్రేరణగా నిలిచింది ? ఈ మధ్యలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య లైగర్, తాన్య (అనన్య పాండే)తో ఎలా ప్రేమలో పడ్డాడు ?, చివరకు లైగర్ తాను అనుకున్న గోల్ కి రీచ్ అయ్యాడా? లేదా ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
లైగర్ పాత్రలో విజయ్ దేవరకొండ చాలా బాగా నటించాడు. ముఖ్యంగా తన పాత్రకు అనుగుణంగా తన నటనలో వేరియేషన్స్ చూపించాడు. అలాగే సినిమాలో సీరియస్ నెస్ తో పాటు ప్లేలోని ఇంట్రస్ట్ ను విజయ్ తన యాక్టింగ్ తో మెయింటైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. మెయిన్ గా క్లైమాక్స్ లో వచ్చే బాక్సింగ్ సీన్ లో విజయ్ దేవరకొండ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అలాగే మరో కీలక పాత్రలో నటించిన రమ్యకృష్ణ కూడా ఎప్పటిలాగే చాల బాగా నటించింది.

ఇక హీరోయిన్ గా నటించిన అనన్య పాండే తన పాత్రకు తగ్గట్లు… తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా కీలక సన్నివేశాల్లో మరియు లవ్ సీన్స్ లో ఆమె నటన బాగుంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. ఒక సాధారణ కుర్రాడు బలమైన ఆశయంతో బాక్సింగ్ రింగ్ లో దిగితే ఎలా ఉంటుందనే పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో.. మంచి మెసేజ్ ఉంది. కానీ కనెక్ట్ అయ్యే ఎమోషనల్ సీన్స్ మాత్రం మిస్ అయ్యాయి.
పైగా లైగర్ లో పాత్రలు, వాటి పరిచయం, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగా బోర్ గా సాగాయి. ద్వితీయార్థంలో అయితే కథ బాగా నెమ్మదిస్తుంది. దీనికి తోడు ప్రతీ పాత్ర జస్ట్ జస్టిఫికేషన్ ఇవ్వటానికి తప్ప ఇంట్రెస్ట్ కలిగించలేదు. సినిమాలో స్టార్టింగ్ సీన్స్ కూడా బాగా స్లోగా ఉన్నాయి. అలాగే లవ్ ట్రాక్ ను మరింత డిటైల్డ్ గా చూపించి ఉంటే.. సినిమా ఇంకా బెటర్ గా ఉండేది.

ప్లస్ పాయింట్స్ :
విజయ్ దేవరకొండ – రమ్యకృష్ణ నటన,
కొన్ని యాక్షన్ సీన్స్,
ఇంటర్వల్ సీన్,
కొన్ని ఎమోషన్స్.
మైనస్ పాయింట్స్ :
సింపుల్ స్టోరీ,
రొటీన్ స్క్రీన్ ప్లే,
సెకండాఫ్ స్లోగా సాగడం,
సినిమాటిక్ టోన్ ఎక్కువ అవ్వడం,
హీరో – హీరోయిన్ లవ్ ట్రాక్.
లాజిక్ లెస్ డ్రామా.
సినిమా చూడాలా ? వద్దా ? :
భిన్నమైన యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ లైగర్, ఫుల్ యాక్షన్ మోడ్ లో సాగినా ఆకట్టుకోలేక పోయింది. బోరింగ్ సీన్స్ అండ్ గ్రిప్పింగ్ నరేషన్ మిస్ కావడం, కథలో ఎక్కడా సహజత్వం లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. కానీ, నటీనటుల నటన మాత్రం ఆకట్టుకుంది. ఓవరాల్ గా ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ కాదు.
రేటింగ్ 2.25 / 5
Also Read:Liger Twitter Review: ‘లైగర్’ ట్విట్టర్ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?