Victory Venkatesh Wig: తెలుగు సినిమాల్లో మినిమమ్ గ్యారంటీ హీరో వెంకటేష్. కుటుంబ కథలకు పేరున్న కథానాయకుడు. కలియుగ పాండవులు సినిమా రంగ ప్రవేశం చేసిన ఆయన ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ తనదైన ప్రతిభతో ఎన్నో విజయాలు అందుకున్నారు. ఆయన కెరీర్ లో బొబ్బిలి రాజా, ధర్మచక్రం, గణేష్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి సినిమాల్లో నటించి తానేమిటో నిరూపించుకున్నారు. సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తూ పలు బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు.
వెంకటేష్ వెంట్రుకలపై చాలా మంది కామెంట్లు చేశారు. ఎప్పుడు టోపీ ధరించి కనిపించే వెంకటేష్ కు బట్టతల ఉందని అనుమానిస్తుంటారు. అది నిజమే అని తేలింది. ఆయన మేకప్ మేన్ రాఘవ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వెంకటేష్ సురేష్ మాదిరి బట్టతల ఉంటుందని సీక్రెట్ బయటపెట్టాడు. వయసు ప్రభావంతో వెంట్రుకలు పోవడం సాధారణమే. అది హీరోలైనా ఎవరైనా జుట్టు ఊడిపోవడం కామనే. వెంకటేష్ కు బట్టతల ఉందో లేదో అనే సందేహాలు అందరిలో వచ్చేవి. ఇప్పుడు రహస్యం తెలియడంతో అందరు అవాక్కవుతున్నారు.
బట్టతల తెలియకుండా వెంకటేష్ ఖరీదైన విగ్గులు వాడతారు. గతంలో బొంబాయి నుంచి విగ్గులు తెప్పించేవారట. ప్రస్తుతం విదేశాల నుంచి తీసుకొస్తున్నారు. సినిమా సినిమాకు విగ్గులు మారుస్తుంటారు. ఆయన ఒక్కో విగ్గు విలువ ఎంతో తెలిస్తే షాకే. ఒక్కో విగ్గుకు రూ.60 నుంచి 70 వేల వరకు ఖర్చు చేస్తారట. అది సినిమా స్థాయిని బట్టి ఉంటుంది. ఒక్కోసారి సినిమా ఆరేడు నెలలు షూటింగ్ ఉంటే రెండు మూడు విగ్గులు వాడతారట. అంత ఖర్చు చేసి విగ్గులు తెప్పించుకుని వాడటంతో ఆయనకు బట్టతల ఉన్నదనే విషయం చాలా మందికి తెలియదు.
సాధారణంగా విగ్గు పెట్టుకోవడం వెంకటేష్ కు ఇష్టం ఉండదు. కానీ ప్రజల్లోకి వెళ్లినప్పుడు బాగుండదనే ఉద్దేశంతో విగ్గు పెట్టుకుని వెళతారు. వయసు ప్రభావంతో అందరికి బట్టతల రావడం సహజమే. కానీ వారి కుటుంబంలో తండ్రి జీన్స్ ప్రభావంతో సురేష్ బాబు, వెంకటేష్ బాబుకు ఇద్దరికి కూడా బట్టతల రావడం సంప్రదాయమే. దీంతో వెంకటేష్ తన విగ్గుల కోసం అంత మొత్తంలో ఖర్చుపెడుతున్నారంటే ఎంత జాగ్రత్తగా ఉంటారో అర్థమవుతోంది. మొత్తానికి వెంకటేష్ విగ్గు బాగోతాన్ని బయటపెట్టడంతో ఆయన మేకప్ మేన్ రాఘవ చెప్పిన రహస్యాలు బట్టబయలు కావడం గమనార్హం.