Victory Venkatesh: టాలీవుడ్ లో ప్రస్తుతం సీనియర్ హీరోల హవా బాగా నడుస్తుంది..మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ లాంటి హీరోలు ఇండస్ట్రీ ని షేక్ చేసే సూపర్ హిట్స్ ని కొట్టి కుర్ర హీరోలకు పోటీ ఇస్తుంటే, మిగిలిన సీనియర్ హీరోలైన వెంకటేష్-నాగార్జున మాత్రం రేస్ లో బాగా వెనుకబడ్డారు..వెంకటేష్ కి సూపర్ హిట్స్ ఉన్నప్పటికీ అవన్నీ మల్టిస్టార్రర్ సినిమాలే..సోలో హీరో గా ఆయన హిట్ కొట్టి చాలా సంవత్సరాలు అయ్యింది.

తమ అభిమాన హీరో నుండి ఎప్పుడు బలమైన హిట్ ని చూస్తున్న అని ఎదురు చూస్తున్న వెంకటేష్ ఫ్యాన్స్ కి ఇప్పుడు ఒక వార్త పండగ చేసుకునేలా చేస్తుంది..F3 చిత్రం తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంకటేష్ ఇప్పుడు ఒక సాలిడ్ కాంబినేషన్ తో మన ముందుకు రాబోతున్నాడు..ఈ సినిమా తోనే వెంకటేష్ తన తోటి హీరోలైన చిరంజీవి – బాలకృష్ణ రేంజ్ కం బ్యాక్ ఇస్తాడని అభిమానులు అంచనా వేస్తున్నారు.
న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే..ఈ సినిమా తర్వాత ఆ చిత్ర దర్శకుడు రాహుల్ విక్టరీ వెంకటేష్ ని కలిసి చాలా రోజుల క్రితమే కథ వినిపించాడు..పూర్తి స్థాయి స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని వినిపించి, మనం ఈ సినిమా చేద్దాము అంటూ వెంకటేష్ అతనికి చెప్పాడట..రీసెంట్ గానే వెంకటేష్ ని కలిసి ఫైనల్ న్యారేషన్ ఇచ్చాడట.

వెంకటేష్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో రేపు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్రకటన చేయబోతుంది నిహారిక ఎంటర్టైన్మెంట్స్ సంస్థ..దీనికి సంబంధించి ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసారు..వెంకటేష్ నుండి చాలా కాలం తర్వాత వస్తున్నా సోలో సినిమా కావడంతో, ఈ మూవీ పై అంచనాలు అటు అభిమానుల్లోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ ఉంటాయి..మరి ఆ అంచనాలను అందుకునే విధంగా ఈ సినిమా ఉంటుందో లేదో చూడాలి.