
Costumes Krishna Passed Away: సినిమాల్లో మీ ఊరాయన నటిస్తున్నడు.. నువ్వు కూడా ప్రయత్నించరాదు..అని ఆ వ్యక్తికి ఒకరు చెప్పారు. దీంతో పొట్ట చేతిలో పట్టుకొని మద్రాసుకు వచ్చాడు. ఓ చోట షూటింగ్ జరుగుతున్న సమయంలో లోపలికి వెళ్లేందుకు గేటు ముందుకు వచ్చాడు.. కానీ సెక్యూరిటీ అనుమతించలేదు. దీంతో గేటు ముందే కూర్చున్నాడు.. ఇంతలో ఓ వ్యక్తి లోపలి నుంచి వచ్చి సినిమాకు జూనియర్ ఆర్టిస్టుల అవసరం ఉంది.. గేటు వద్ద ఉన్నవారందరినీ లోపలికి పంపు అన్నాడు.. అందరితో పాటు అతను కూడా లోపికి వెళ్లి రోజంతా సినిమాల్లో నటించాడు.. షూటింగ్ పూర్తయిన తరువాత అతనికి భోజనం పెట్టి 50 పైసలు చేతిలో పెట్టి పంపించారు. కానీ అంతలో ఒకాయన ఈయన నటనను చూసి నీకు నటించడం కాకుండా ఇంకేంపని వచ్చు? అని అడిగాడు. వెంటనే అతడు టైలరింగ్ వచ్చాడు. మరి లేడీస్ జాకిట్లు కుడుతావా ? అని అడిగాడు. నేర్చుకుంటానని ఆయన చెప్పాడు. అక్కడి నుంచి ఆయన జీవితం మలుపు తిరిగింది.
అలా సినిమాల్లోని వారికి దుస్తులు కుడుతూ కాస్ట్యూమ్ డిజైనర్ గా మారాడు. ఈయన డిజైన్స్ తో ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవిల లుక్స్ మారిపోయాయి. అలా జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాకి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా అవార్డు కూడా వచ్చింది. ఈ అవార్డు వచ్చిన తరువాత అతడిని ‘కాస్ట్యూమ్ కృష్ణ’ అని పిలుస్తున్నారు. కాస్ట్యూమ్ కృష్ణ డిజైనర్ గానే కాకుండా నటుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన నటించిన ‘భారత్ బంద్’ సినిమా ఎప్పటికీ గుర్తుంటుంది. ఇటీవల కాస్ట్యూమ్ కృష్ణ మరణించారు. ఈ సందర్బంగా ఆయన గురించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ మధ్య వరుస సినిమాలు చేసిన ఈయన ఒకేసారి సినిమాల నుంచి తప్పుకున్నారు. అందుకు కారణమేంటి? అన్న చర్చ సాగుతోంది.
కాస్ట్యూమ్ కృష్ణ 1937 సంవత్సరంలో విజయనగరం జిల్లా లక్కవరపు కోటలో జన్మించారు. మొదట్లో సాదా సీదా లైఫ్ ను గడిపిన తరువాత ఈయనకు సినిమాల్లో నటించాలన్న కోరిక బలంగా ఉండేది. ఆ ఆశతో ఆయన మద్రాస్ ట్రైన్ ఎక్కాడు. సినిమాల్లో అవకాశం వచ్చిన తరువాత కృష్ణ నటించిన ‘ముద్దు బిడ్డ’ సినిమాలో అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా జాయిన్ అయ్యారు. ఆ తరువాత అన్నీ నేర్చుకున్న ఆయన సొంతంగా డిజైన్ చేసే స్థాయికి ఎదిగారు. యువతలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిశీలించి వారికి అనుగుణంగా దుస్తులను తయారు చేసేవారు.

సీనియర్ ఎన్టీరామారావుకు దోతి కట్టుకోవడం ఇబ్బందిగా మారింది. ఇది కట్టుకొని సినిమాలు చేస్తున్నప్పుడు వాటికి పిన్నులు పెట్టేవారు. అయితే వీటి అవసరం లేకుండా కాస్ట్యూమ్ కృష్ణ దోతిలా ఉండే ప్యాంటును తయారు చేశారు. ఇది చూసిన ఎన్టీఆర్ కాస్ట్యూమ్ కృష్ణను అభినందించారు. అప్పటి నుంచి ఆయన కెరీర్ ఉన్నతంగా సాగింది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోలందిరికీ ఈయనే డిజైనర్ గా మారారు. అలాగే హీరోయిన్లకు కూడా జాకెట్లను అద్భతంగా డిజైన్ చేయడంలో కాస్ట్యూమ్ కృష్ణకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
కాస్ట్యూమ్ డిజైనర్ గానే కాకుండా నటుడిగా ఈయనకు మంచి ప్రతిభ ఉంది. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాలను చేశాడు. కోడిరామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన ‘భారత్ బంద్’ సినిమాతో నటుడిగా పరిచయం అయిన ఆ తరువాత అల్లరి మొగుడు, పెళ్లాం చెబితే వినాలి, అల్లరి మొగుడు, మా ఆయన బంగారం, దేవుళ్లు వంటి సినిమాల్లో కనిపించారు. ఆయన ఎక్కువగా కోడి రామృష్ణ సినిమాల్లోనే కనిపించడం విశేషం. అందుకే ఆయనను కాస్ట్యూమ్ కృష్ణ గురువుగా భావిస్తారు.
మరి కాస్ట్యూమ్ కృష్ణ సినిమాల నుంచి సడెన్లీగా తప్పుకోవడానికి బలమైన కారణం ఉంది. ఆయన కృష్ణ కుమారుడు మహేష్ బాబుతో ఓ సినిమా చేయాడానికి రెడీ అయ్యారు. అందుకు కృష్ణ కూడా ఒప్పుకున్నారు. అయితే తన పెద్దకొడుకు ఒత్తిడి వల్ల వేరే సినిమా తీయాల్సి వచ్చింది. అయితే తనకు చదువురాకపోవడంతో ప్రొడక్షన్ మేనేజర్ వేరే వ్యక్తిని నియమించుకున్నారు. కానీ అతను పలు రకాలుగా తనను మోసం చేశారని కాస్ట్యూమ్ కృష్ణ చెప్పారు. దీంతో భారీగా నష్టపోయిన ఆయన తనదగ్గరున్నదంతా ఊడ్చి ‘పెళ్లి పందిరి’ని తీశాడు.
ఈ సినిమా ప్రమోషన్ కోసం తన దగ్గర డబ్బుల్లేవని కాస్ట్యూమ్ కృష్ణ చెప్పాడు. దీంతో బయ్యర్లంతా కలిసి జగపతి బాబు సమక్షంలో కాస్ట్యూమ్ కృష్ణతో తాము ప్రమోషన్ చేస్తామని చెప్పి తెల్ల కాగితంపై సంతకాలు చేయించుకున్నారు. తనకు చదువు రానందున కాస్ట్యూమ్ కృష్ణ నిజమని నమ్మారు. కానీ తన నెగెటివ్ రైట్స్ మొత్తం రాయించినట్లు ఆ తరువాత బయ్యర్లు మార్చుకోవడంతో కాస్ట్యూమ్ కృష్ణ షాక్ తిన్నాడు. ఇక ‘పెళ్లిపందిరి’ రిలీజైన తరువాత మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా పెట్టుబడి కంటే పదింతల లాభం వచ్చింది. కానీ కాస్ట్యూమ్ కృష్ణకు ఒక్క రూపాయి రాలేదు. దీంతో సినిమా ఫీల్డ్ పై విరక్తి చెందిన ఆయన సినిమాల నుంచి తప్పుకున్నారు.