Rana Daggubati- Ashrita: టాలీవుడ్ ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీ ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రముఖ నిర్మాత డి రామానాయుడు తరువాత విక్టరి వెంకటేశ్ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆ తరువాత నిర్మాత సురేష్ కుమారుడు రానా సైతం ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా నటుడిగా మారిపోయాడు. ‘రానా’ సినిమాల్లోనే కాకుండా పర్సనల్ విషయాలను అప్పడప్పడు షేర్ చేస్తుంటాడు. కొన్ని నెలల కిందట ఓ ఇంటివాడైన రాన తన సతీమణి విహికాతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. తాజాగా ఈ యంగ్ హీరో తన చెల్లెలు, వెంకటేష్ కూతురుతో కలిసి పిజ్జా తయారు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే?
ఫ్యామిలీ చిత్రాల హీరోగా వెంకటేష్ కు బెస్ట్ ఇమేజ్ ఉంది. సినిమాల్లోనే కాకుండా రియల్ గా వెంకీ పెద్ద ఫ్యామిలీనే నడుపుతున్నారు. ఆయన పెద్ద కూతురు ఆశ్రిత పెళ్లయిన తరువాత సొంత బిజినెస్ చేస్తోంది. ‘ఇన్ఫినిటీ ప్లేటర్’ పేరుతో బేకరీ ఫుడ్స్ ను రన్ చేస్తోంది. తన బేకరీలో మేకింగ్ చేసే కొన్ని వీడియోలను సొంతంగా యూట్యూప్ పెట్టి అందులో అప్లోడ్ చేస్తోంది. గతంలో ఆశ్రిత బావ అయిన నాగచైతన్యతో కలిసి పుడ్స్ తయారు చేస్తూ వీడియోలో కనిపించింది. లేటేస్టుగా బ్రదర్ రానాతో కలిసి సందడి చేసింది.
వీరిద్దరు కలిసి తమ తాతయ్య రామానాయుడి గారి పాత ఇంట్లోకి వెళ్లారు. తమ గుర్తులను నెరేసుకున్నారు. ఆ ఇంట్లో తన ఫేవరేట్ బాల్కనీ అని రానా చెప్పుకొచ్చారు. అక్కడ ఎన్నో అందమైన కళాకృతులు ఇప్పటికీ ఉన్నాయి. రామానాయుడుకు సంబంధించిన భారీ ఫొటో ప్రేమ్స్ ఉన్నాయి. అలాగే ఆకర్షణీయమైన గదులతో పాటు డైనింగ్ టేబుల్ తో హౌస్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఇంటిని శాంక్చువరీ పేరుతో రెస్టారెంట్ గా మార్చారట. దీనిని రానా స్నేహితుడు రన్ చేస్తున్నట్లు సమాచారం.
అయితే ఇంట్లోకి అన్నయ్య రానాతో కలిసి ఆశ్రిత వచ్చారు. వంటలు చేయడంలో చేయితిరిగిన ఆమె రానా తో కలిసి పిజ్జాను తయారు చేసింది. ఒకప్పుడ చేసిన అల్లరి పనులను చెప్పుకుంటూ ఇప్పుడు కూడా సరదాగా రానాతో కలిసి సందడి చేసింది. తాను చేసే ఫుడ్ గురించి చెబుతూ తన చిన్నప్పుడు రానాతో ఎలా ఉండేదో వివరించింది. మొత్తానికి తన ఫుల్ వీడియోను సోషల్ మీడియాలో అప్పోడ్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.