https://oktelugu.com/

Venkatesh Saindhav : యమ జోరుమీదున్న వెంకీ… సైంధవ్‌ రిలీజ్ డేట్ ఫిక్స్, పర్ఫెక్ట్ టైమ్!

Venkatesh Saindhav release date : ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా ట్రెండ్, సిట్యుయేషన్ కి తగ్గట్లు సినిమాలు చేస్తున్న ఏకైక హీరో వెంకటేష్. చిరంజీవి, బాలకృష్ణ మాస్ కమర్షియల్ హీరోగా జోరు చూపిస్తున్నారు. నాగార్జున, వెంకీలను మాత్రం ప్రేక్షకులు అంగీకరించడం లేదు. నాగార్జున అలాంటి ప్రయత్నాలు చేసి పరాజయాలు చవిచూస్తున్నారు. వెంకీ వయసుకు తగ్గ పాత్రలు, మల్టీ స్టారర్స్ ఎంచుకుంటూ విక్టరీ బిరుదును సార్ధకం చేసుకుంటున్నారు. నారప్ప, దృశ్యం 2 చిత్రాల్లో ఆయన పెళ్ళీడుకొచ్చిన పిల్లల తండ్రిగా […]

Written By:
  • NARESH
  • , Updated On : March 29, 2023 / 08:44 PM IST
    Follow us on

    Venkatesh Saindhav release date : ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా ట్రెండ్, సిట్యుయేషన్ కి తగ్గట్లు సినిమాలు చేస్తున్న ఏకైక హీరో వెంకటేష్. చిరంజీవి, బాలకృష్ణ మాస్ కమర్షియల్ హీరోగా జోరు చూపిస్తున్నారు. నాగార్జున, వెంకీలను మాత్రం ప్రేక్షకులు అంగీకరించడం లేదు. నాగార్జున అలాంటి ప్రయత్నాలు చేసి పరాజయాలు చవిచూస్తున్నారు. వెంకీ వయసుకు తగ్గ పాత్రలు, మల్టీ స్టారర్స్ ఎంచుకుంటూ విక్టరీ బిరుదును సార్ధకం చేసుకుంటున్నారు. నారప్ప, దృశ్యం 2 చిత్రాల్లో ఆయన పెళ్ళీడుకొచ్చిన పిల్లల తండ్రిగా నటించడం విశేషం.

    ఎఫ్ 3లో హీరో వరుణ్ తో పాటు సందడి చేశారు. ఓరి దేవుడా మూవీలో మోడరన్ భగవంతుడిగా విలక్షణ పాత్ర చేశారు. అయితే తన 75వ చిత్రానికి వెంకటేష్ పంథా మార్చారు. సోలో హీరోగా భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ ప్లాన్ చేశాడు. ‘హిట్’ అండ్ ‘హిట్ 2’ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలనుతో సైంధవ్‌ టైటిల్ తో మూవీ ప్రకటించారు. ప్రకటన ప్రోమో అంచనాలు పెంచేసింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఛాయలు కనిపిస్తున్నాయి.

    హిట్ సిరీస్ తో శైలేష్ కొలను టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. క్రైమ్ థ్రిల్లర్స్ లో పీక్స్ చూపించాడు. మూడో చిత్రం దానికి భిన్నంగా ప్లాన్ చేశాడు. దీని బ్యాక్ గ్రౌండ్ మెడికల్ మాఫియా కావచ్చు అంటున్నారు. అదే సమయంలో ఇది హిట్ సిరీస్ లో భాగం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఏది ఏమైనా వెంకీ నుండి కమర్షియల్ ఎంటర్టైనర్ వచ్చి చాలా కాలం అవుతుంది. ఆ కోరిక సైంధవ్‌ తీర్చనుంది.

    గత ఏడాది చివర్లో చిత్ర ప్రకటన చేయగా… విడుదల తేదీ లాక్ చేశారు. 2023 డిసెంబర్ 22న సైంధవ్‌ వరల్డ్ వైడ్ పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. అంటే వెంకటేష్ క్రిస్మస్ బరిలో దిగుతున్నారు. ఇది పర్ఫెక్ట్ రిలీజ్ డేట్. క్రిస్మస్ నుండి న్యూ ఇయర్ వరకు కలెక్షన్స్ కొల్లగొట్ట వచ్చు. సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తే సంక్రాంతి దాకా వసూళ్లు కొనసాగుతాయి. పుష్ప, అఖండ, శ్యామ్ సింగరాయ్ ఇదే సీజన్లో విడుదలైన మంచి విజయాలు సాధించాయి. ఇక సైంధవ్‌ మూవీలో శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ అని ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక రోల్ చేస్తున్నారు. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నారు.