
Rana Naidu Profit: రీసెంట్ గా విడుదలైన వెంకటేష్ – రానా దగ్గుపాటి ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలై సోషల్ మీడియా లో సెన్సేషనల్ హాట్ టాపిక్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ సిరీస్ ఇలా హాట్ టాపిక్ గా మారడానికి ప్రధాన కారణం, అందులో వెంకటేష్ పచ్చి బూతులు మాట్లాడడమే.వెంకటేష్ తన ఇన్నేళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానం లో ఎన్నడూ కూడా ఇలా బూతులు మాట్లాడడం కానీ, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడడం కానీ చెయ్యలేదు.
కానీ మొట్టమొదటిసారి ఆయన చేత పూర్తి స్థాయి బోల్డ్ రోల్ వేయించి నోటికి వచ్చిన బూతులన్నీ మాట్లాడించారు.వెంకటేష్ ని అభిమానించే వాళ్ళ దగ్గర నుండి చాలా తీవ్రమైన విమర్శలు వచ్చాయి కానీ, కొంతమంది యూత్ ఈ అడల్ట్ కంటెంట్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.మొదట్లో నెగటివ్ రివ్యూస్ దండయాత్ర చేసినా, ఇప్పుడు మెల్లగా టాక్ మారుతుంది.
రోజు రోజుకి వ్యూస్ కూడా ఈ సిరీస్ కి బాగా పెరిగిపోతుంది, ప్రస్తుతానికి ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న అన్నీ వెబ్ సిరీస్ కంటే టాప్ లో ట్రేండింగ్ అవుతుంది.ఇప్పటి వరకు ఈ సిరీస్ కి 80 మిలియన్ వాచ్ మినిట్స్ వచ్చినట్టు సమాచారం.ఇక ఈ అడల్ట్ కంటెంట్ లో వెంకటేష్ నటించేందుకు ఒప్పుకోవడానికి కూడా కారణం నెట్ ఫ్లిక్స్ సంస్థ అందించిన భారీ రెమ్యూనరేషన్ అని తెలుస్తుంది.ఒక్కో సినిమాకి ఆరు నుండి పది కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకునే వెంకటేష్, ఈ చిత్రానికి ఏకంగా 12 కోట్ల రూపాయిలు తీసుకున్నాడట.
అలాగే రానా దగ్గుపాటికి కూడా 8 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు సమాచారం.వీళ్ళ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రెమ్యూనరేషన్ ఆఫర్ చెయ్యడం వల్లే, ఈ బోల్డ్ కంటెంట్ రోల్ లో నటించడానికి ఒప్పుకున్నట్టు సమాచారం.మొత్తానికి నెగటివిటీ ని మూటగట్టుకున్నప్పటికీ కూడా లాభాలను బాగా తీసుకొచ్చినందుకు అభిమానులు కాస్త సంతృప్తి చెందారు.