
Venkatesh: సాఫ్ట్ గా కనిపించే వెంకటేష్ ఓ విషయంలో బాగా హర్ట్ అయ్యాడు. అబ్బాయని కూడా చూడకుండా రానాకు ఇచ్చిపడేశాడు. ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్ హీరో నన్ను కాదని టైటిల్ కి రానా పేరు పెట్టేదేంటని వార్నింగ్ ఇచ్చాడు. రానా నాయుడు వెబ్ సిరీస్ టైటిల్ ని ఉద్దేశిస్తూ వెంకటేష్ ఓ వీడియో విడుదల చేశారు. సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వెంకటేష్, రానా ఫస్ట్ టైం కలిసి నటిస్తున్నారు. వీరి కాంబోలో రానా నాయుడు టైటిల్ తో వెబ్ సిరీస్ రూపొందుతుంది.
Also Read: Khushi Re Release: శివరాత్రికి మరోసారి రీ – రిలీజ్ అవ్వబోతున్న పవన్ కళ్యాణ్ ‘ఖుషి’
హాలీవుడ్ సక్సెస్ సిరీస్ రే డొనోవన్ ఆధారంగా రానా నాయుడు తెరకెక్కింది. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ కాగా త్వరలో స్ట్రీమ్ కానుంది. వెంకటేష్, రానాలకు ఇది డెబ్యూ వెబ్ సిరీస్ కూడాను. దీంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలో రానా నాయుడు ప్రసారం కానుంది. అయితే టైటిల్ విషయంలో వెంకటేష్ అసహనం వ్యక్తం చేశారు. ” ఈ సిరీస్ హీరో నేను, స్టార్ నేను, ఫ్యాన్ బేస్ ఉంది నాకు. అలాంటిది నా క్యారెక్టర్ నేమ్ టైటిల్ గా పెట్టాలి కానీ… రానా రోల్ నేమ్ టైటిల్ గా పెట్టడమేంటి. నాగా నాయుడు అని టైటిల్ మార్చేయండి” అంటూ నెట్ఫ్లిక్స్ యాజమాన్యానికి వెంకటేష్ వార్నింగ్ ఇచ్చాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇదంతా ప్రమోషన్స్ లో భాగమే. సిరీస్ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రమోషన్స్ వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఇక రానా సిల్వర్ స్క్రీన్ మీద అరుదుగా కనిపిస్తున్నారు. విరాటపర్వం మూవీ తర్వాత ఆయన మరో చిత్రానికి సైన్ చేయలేదు. అయితే రానా నాయుడు సిరీస్తో బుల్లితెరపై ఆయన అలరించనున్నారు.

ఇక వెంకీ పాత్ర రానా నాయుడు సీరీస్లో చాలా భిన్నంగా ఉంటుందని సమాచారం. ఆయన లుక్ ఆసక్తి రేపుతోంది. గత ఏడాది వెంకీ ఎఫ్3, ఓరి దేవుడా చిత్రాల్లో నటించారు. తాజాగా హిట్ సిరీస్ ఫేమ్ శైలేష్ కొలనుతో సైంధవ్ టైటిల్ తో పాన్ ఇండియా మూవీ ప్రకటించారు. అనౌన్స్మెంట్ టీజర్ మూవీపై అంచనాలు పెంచండి. సైంధవ్ మెడికల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. చాలా కాలం తర్వాత వెంకటేష్ సోలో యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు.
Tera naam bhi meine rakha, show ka naam bhi mein rakhega.#RanaNaidu ki aisi ki taisi. @RanaDaggubati @NetflixIndia pic.twitter.com/R3GYlwZsEl
— Venkatesh Daggubati (@VenkyMama) February 13, 2023