
Khushi Re Release: గత ఏడాది డిసెంబర్ 31 వ తారీఖున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘ఖుషి’ ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేసిన సంగతి తెల్సిందే.అభిమానులు మరియు మేకర్స్ కూడా ఊహించని రీతిలో ఈ సినిమా రీ రిలీజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది.మొదటి రోజు దాదాపుగా నాలుగు కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం ఫుల్ రన్ లో 8 కోట్ల రూపాయిల గ్రాస్ మరియు నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది.
Also Read: Manchu Lakshmi- Manoj Marriage: అది నా పరిధిలో లేదు… మనోజ్ పెళ్లిపై మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్!
ఇది ఆల్ టైం ఆల్ ఇండియన్ రికార్డు గా చెప్పుకోవచ్చు.ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి కానీ, ఈ రేంజ్ వసూళ్లను మాత్రం ఒక్క సినిమా కూడా రాబట్టలేకపోయింది.అది కేవలం పవన్ కళ్యాణ్ క్రేజ్ వల్ల అయ్యిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.
ఇప్పుడు మరోసారి ఈ సినిమాని శివ రాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నారు.రాయలసీమ ప్రాంతానికి సంబంధించి అభిమానులు ఎవ్వరైనా ఖుషి సినిమాని వేసుకోవాలనుకుంటే 9010963215 కి కాల్ చెయ్యండి అంటూ ఆ ప్రాంత డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి ట్విట్టర్ లో ట్వీట్ వేసాడు.అంతే కాకుండా ఈ చిత్రాన్ని హైదరాబాద్ లో కూడా పలు థియేటర్స్ లో ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రాన్ని ఎన్ని సార్లు రీ రిలీజ్ చేసిన జనాలు ఎగబడి చూస్తారని.ఆయనకి మరియు ఆ సినిమాకి ఉన్న క్రేజ్ అలాంటిదని అభిమానులతో పాటుగా ట్రేడ్ వర్గాలు కూడా చెప్తున్న మాట.కేవలం ఖుషి చిత్రం మాత్రమే కాదు, పలు ప్రాంతాలలో జల్సా మరియు గబ్బర్ సింగ్ సినిమాలు కూడా ప్రదర్శితం కాబోతున్నాయి.ఇలా శివ రాత్రి రోజున ఒకే హీరో కి సంబంధించి ఇన్ని సినిమాలు విడుదలవ్వడం ఇదే తొలిసారి అంటున్నారు.
Also Read:Shah Rukh Khan- Allu Arjun: బ్రేకింగ్ : షారుక్ ఖాన్ ‘జవాన్’ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్