https://oktelugu.com/

Venkatesh Fun with Bithiri Sathi : బిత్తిరి సత్తికి లైవ్ లోనే షాకిచ్చిన వెంకటేశ్

Venkatesh Fun with Bithiri Sathi: సమయానుసారం టైమింగ్ తో కామెడీ చేయడంలో టాలీవుడ్ లో విక్టరీ వెంకటేశ్ తర్వాతే ఎవరైనా.. వెంకీ కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుందని చాలా సినిమాల్లో మనకు నిరూపితమైంది. చాలా రోజుల తర్వాత వెంకటేశ్ కామెడీ విశ్వరూపాన్ని ‘ఎఫ్2’ సినిమాలో అద్భుతంగా పండించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పుడు ‘ఎఫ్3’ పేరిట మరో కామెడీ ప్రపంచానే సృష్టించాడు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎఫ్3 […]

Written By: , Updated On : May 27, 2022 / 12:28 PM IST
Follow us on

Venkatesh Fun with Bithiri Sathi: సమయానుసారం టైమింగ్ తో కామెడీ చేయడంలో టాలీవుడ్ లో విక్టరీ వెంకటేశ్ తర్వాతే ఎవరైనా.. వెంకీ కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుందని చాలా సినిమాల్లో మనకు నిరూపితమైంది. చాలా రోజుల తర్వాత వెంకటేశ్ కామెడీ విశ్వరూపాన్ని ‘ఎఫ్2’ సినిమాలో అద్భుతంగా పండించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పుడు ‘ఎఫ్3’ పేరిట మరో కామెడీ ప్రపంచానే సృష్టించాడు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో జనాలు ఎంజాయ్ చేస్తున్నారు.

Venkatesh Fun with Bithiri Sathi

Venkatesh, Bithiri Sathi

ఈ క్రమంలోనే ఎఫ్3 మూవీ ప్రమోషన్లలో పాల్గొంది. కమెడియన్ బిత్తిరిసత్తితో వెంకటేశ్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. బిత్తిరిసత్తి తనదైన ‘బిత్తిరి’ లాంగ్వేజ్ లో పదాలు పలుకుతూ కామెడీ పంచుతుంటాడు. ప కు బదులుగా ‘ఫ’ అని పలుకుతూ నవ్వులు పూయిస్తాడు.

Also Read: F3 Movie Review: రివ్యూ : ఎఫ్ 3

‘ఎఫ్3’ మూవీ ప్రమోషన్ లో కూడా ఇదే చేవాడు. ‘ఇప్పుడు ఫ(మ)ల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు కదా.. మీరే టాలీవుడ్ లో ఎక్కువ ఫల్టీ స్టారర్ లు ఎందుకు చేస్తున్నారని’ వెంకటేశ్ ను ప్రశ్నించాడు సత్తి. దీనికి వెంటనే వెంకీ కూడా స్పాంటేనియస్ గా సత్తి భాషలోనే కౌంటర్ ఇవ్వడం విశేషం.

Venkatesh Fun with Bithiri Sathi

Venkatesh, Bithiri Sathi

బిత్తిరి సత్తిని ఇమిటేట్ చేస్తూ అచ్చు అతడు మాట్లాడినట్టే అచ్చు గుద్దినట్టు దించేశాడు విక్టరీ వెంకటేశ్. తాను ముందు నుంచి ఫల్టీ స్టారర్ సినిమాలు చేశానని.. తనకు ఫల్టీ స్టారర్ మూవీ చేయడం చాలా ఇష్టమన్నారు. నేను ఏం ఫాఫం చేశానో కానీ.. చాలా ఫల్టీ స్టారర్ సినిమాలు చేశానన్నాడు. తాను చేసిన అన్నీ ఫల్టీ స్టారర్ సినిమాలు బాగా ఆడాయని.. ఫెంటాస్టిక్ అని వెంకటేశ్ అంటూ బిత్తిరి సత్తినే ఆడేసుకున్నాడు.

ఇక బిత్తిరి సత్తిని ఆడేసుకుంటున్న వెంకటేశ్ టైమింగ్ కు పక్కనే ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి పగలబడి నవ్వాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Tollywood Young Hero: యంగ్ హీరోపై మోజు పడుతున్న హీరోయిన్లు

ఈ Interview చూస్తే నవ్వలేక చచ్చిపోతారు || Bithiri Sathi Hilarious Interview With Venkatesh || NS