
Rana Naidu: బాబాయ్-అబ్బాయ్ కలిసి ఏదో కళాఖండం తీస్తారనుకుంటే మరీ ఆడోళ్ళు, సంసారులు చూడలేని బూతుల చిత్రం చేశారన్న మాట వినిపిస్తోంది. మార్చి 10న నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చిన రానా నాయుడు చూసిన ఆడియన్స్ షాక్ తిన్నారు. తమ అభిప్రాయం సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు. ఈ రేంజ్ బూతులు వెంకీ లాంటి ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న హీరో నుండి ఆశించలేదని అంటున్నారు. పొరపాటున కూడా ఫ్యామిలీతో చూసే సాహసం చెయ్యొద్దని హితవు పలుకుతున్నారు. వెంకటేష్, రానాతో పాటు పలు క్యారెక్టర్స్ విచ్చలవిడిగా బూతులు మాట్లాడారు.
ఒక్క మాటలో చెప్పాలంటే మీర్జాపూర్ సిరీస్ ని మించిపోయిందంటున్నారు. వెబ్ కంటెంట్ కి పరిమితులు లేని మాట నిజమే. అయితే కంటెంట్ అనేది నటుల ఇమేజ్ ఆధారంగా తెరకెక్కాలి. ఎంత ఓటీటీ అయితే మాత్రం వెంకటేష్ లాంటి హీరో కు**, గు** వంటి బూతులు మాట్లాడటం జీర్ణించుకోవడం కష్టమే. ట్రైలర్లోనే మేకర్స్ దీనిపై హింట్ ఇచ్చారు. కొంచెం బూతులు డోసు ఎక్కువగానే ఉంటుందని చెప్పకనే చెప్పారు. అయితే ఈ స్థాయిలో ఉంటాయని ఊహించలేదు.
హాలీవుడ్ సిరీస్లు, సినిమాల్లో బూతులు సాధారణంగానే వేస్తారు. దాన్ని ఒక తప్పుగా చూడరు. ఫ**. మదర్ ఫ*** వంటి బూతులు సాధారణంగా చూడొచ్చు. రానా నాయుడు హాలీవుడ్ సిరీస్ రే డొనోవన్ రీమేక్ . అమెరికాలో ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్. ఏకంగా 7 సీజన్స్ నడిచింది. దాన్ని రానా నాయుడిగా ఇండియాలో తెరకెక్కించారు. ఒరిజినల్ సిరీస్లో ఉన్న పాత్రల షేడ్స్ యాజిటీజ్ గా దించేశారు. బూతులు మాట్లాడే క్రిమినల్స్ క్యారెక్టర్స్ కావడంతో ఇండియన్ వెర్షన్ లో కూడా అలానే చూపించారు.

విడుదలకు ముందే వెంకటేష్ ఈ బూతులపై స్పందించారు. కొన్నిసార్లు సాహసం చేయక తప్పదు. నటుడిగా నాకు ఇది ఛాలెంజ్. ఇక్కడ మీరు క్యారెక్టర్ ని చూడాలి. వెంకటేష్ అనే వ్యక్తిని కాదన్నారు. రానా నాయుడుతో సరికొత్త ప్రయోగం చేశామన్నారు. హిందీతో పాటు ఇతర భాగాల్లో వెంకటేష్ ఇమేజ్ ఏంటో తెలియదు కాబట్టి… పెద్దగా సమస్య లేదు. తెలుగు ఆడియన్స్ అంగీకరించడం కష్టం. సోషల్ మీడియాలో రానా నాయుడు సిరీస్ పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేని దారుణమైన కంటెంట్ అన్న అభిప్రాయం వినిపిస్తుంది.