Venkaiah Naidu Suresh Gopi: పార్లమెంట్ అంటేనే వాడివేడిగా సాగే చర్చను చూస్తుంటాం. అధికార, ప్రతిపక్షాల విమర్శలు, వాడి వేడి వాదనలు, ఆందోళనలతో అట్టుడుకుతుంటుంది.అందులో కామెడీ పాళ్లు చాలా తక్కువ. కానీ టైమింగ్ తో మాట్లాడే మన ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తాజాగా రాజ్యసభలో నవ్వులు పూయించారు. ఆయన ప్రముఖ మలయాళ నటుడు, రాజ్యసభ ఎంపీ అయిన సురేష్ గోపీపై వేసిన సెటైర్ కు అందరూ పడి పడి నవ్వారు.
Suresh Gopi, Venkaiah Naidu
రాజ్యసభలో తాజాగా మలయాళ నటుడు, రాజ్యసభ ఎంపీ సురేష్ గోపీ మధ్య సరదా సన్నివేశం చోటుచేసుకుంది. దీంతో సభలో అందరూ ఘోల్లున నవ్వారు. సురేష్ గోపీ గడ్డాన్ని చూసిన వెంకయ్యనాయుడు ఒక్క క్షణం అయోమయంలో పడ్డారు. వెంటనే ఆయన అడిగిన ప్రశ్నకు సభ అంతా నవ్వుల మయం అయ్యింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెంకయ్య నాయుడు సమయస్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Also Read: Andhra Pradesh MP Vs SP: ఏకంగా ఎస్పీ స్థలానికే ఎసరు పెట్టిన ఎంపీ.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో..?
రాజ్యసభ ఎంపీగా ఉన్న సురేష్ గోపీ తాజాగా రాజ్యసభలో మాట్లాడుతుండగా.. వెంకయ్య కలుగజేసుకున్నారు. ఆయనను చూసి ‘అది మాస్కా? లేక గడ్డమా?’ అని నవ్వుతూ అడిగారు. దీంతో సభలో ఒక్కసారిగా అంతా నవ్వుకున్నారు. దీనికి సురేష్ గోపీ కూడా నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ‘ఇది గడ్డమే గడ్డమే సార్’ అంటూ చెప్పుకొచ్చారు. రాబోయే సినిమాలో తన కొత్త లుక్ అని చెప్పారు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెంకయ్య నాయుడు టైమింగ్ లో వేసే పంచులు బాగా పేలుతాయని మరోసారి రుజువైంది. వెంకయ్య ఇలానే చాలా ప్రసంగాలు, సభల్లో వేసే పంచులు సభికులను అలరిస్తూనే ఉంటాయి. తాజాగా రాజ్యసభలోనూ అదే రిపీట్ అయ్యింది.
HAHAHA! Our VP @MVenkaiahNaidu Garu and his wicked sense of humour! Never a dull moment with him around! Suresh Gopi this time!
Yappa! 😂 #CannotAbleTo #EpicLol pic.twitter.com/WfhZ6NIsYb
— मङ्गलम् (@veejaysai) March 25, 2022