https://oktelugu.com/

Veera Simha Reddy Villain Duniya Vijay: సెలబ్రెటీ బయోగ్రఫీ : ‘వీర సింహారెడ్డి’ విలన్ దునియా విజయ్ హిస్టరీ తెలుసా?

Veera Simha Reddy Villain Duniya Vijay:  ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ మూవీ మంచి హిట్ గా నిలిచింది.. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ఈ సినిమాలో బాలయ్య బాబు కి ఎంత మంచి పేరు వచ్చిందో, విలన్ గా చేసిన దునియా విజయ్ కి కూడా అంతే పేరు వచ్చింది.. ఈ సినిమా ముందు వరకు దునియా విజయ్ అంటే ఎవరో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 20, 2023 / 01:07 PM IST
    Follow us on

    Veera Simha Reddy Villain Duniya Vijay:  ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ మూవీ మంచి హిట్ గా నిలిచింది.. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ఈ సినిమాలో బాలయ్య బాబు కి ఎంత మంచి పేరు వచ్చిందో, విలన్ గా చేసిన దునియా విజయ్ కి కూడా అంతే పేరు వచ్చింది.. ఈ సినిమా ముందు వరకు దునియా విజయ్ అంటే ఎవరో టాలీవుడ్ ప్రేక్షకులకి తెలియదు.. కానీ బాలయ్య తో సరిసమానంగా ఆయనతో ఢీ కొడుతూ చాలా బాగా చేసాడే అని అందరి నోళ్లల్లో బాగా నానాడు..ఈ దునియా విజయ్ మీరు అనుకుంటున్నట్టు కొత్త నటుడు కాదు.. కన్నడలో ప్రస్తుతం ఉన్న టాప్ లీడింగ్ స్టార్ హీరోలలో ఒకడు.. అక్కడ ఈయనకి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు , రికార్డ్స్ బ్రేక్ చేసిన సినిమాలు ఉన్నాయి.. అంత స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ కూడా బాలయ్య బాబు అడగడంతో విలన్ రోల్ చేయడానికి ఏమాత్రం వెనకాడలేదు.. ఇప్పుడు దునియా విజయ్ కి సంబంధించిన పూర్తి బయోగ్రఫీ తెలుసుకుందాం..

    Veera Simha Reddy Villain Duniya Vijay

    -బాల్యం, విద్యాభ్యాసం

    దునియా విజయ్ 1974వ సంవత్సరం జనవరి 20వ తారీఖున కుంభరాణాహాలి గ్రామంలో జన్మించాడు.. ఆయన బాల్యం , విద్యాబ్యాసం మొత్తం కర్ణాటకలోని అనేకల్ మండలంలో కుంభరాణాహాలి గ్రామంలోనే సాగింది.. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే ఆయనకీ నాగర్తన అనే అమ్మాయితో వివాహం జరిగింది.. సుమారు 14 ఏళ్ళ పాటు ఆమెతో కాపురం చేసిన తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల 2013వ సంవత్సరంలో ఆమెతో విడిపోవాల్సి వచ్చింది.. ఇక తర్వాత 2016 వ సంవత్సరంలో కీర్తి అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నాడు.

    -సినీ కెరీర్ :

    ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన నటుడు కాబట్టి ప్రారంభంలో ఈయనకి చాలా చిన్న పాత్రలే దక్కాయి.. కన్నడ స్టార్ హీరో సుదీప్ నటించిన ‘రంగ SSLC’ అనే సినిమా ద్వారా ఒక చిన్న పాత్రతో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.. ఆ తర్వాత పలు సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ ద్వారానే మంచి పాపులారిటీ తెచ్చుకున్న విజయ్ ఆ తర్వాత ‘దునియా’ అనే సినిమాతో హీరోగా పరిచయమై భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.. ఈ సినిమా తర్వాత విజయ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు..వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ కన్నడ లో స్టార్ హీరోగా ఎదిగాడు.. ‘వీర సింహా రెడ్డి’ సినిమాకి ముందు ఆయన కన్నడలో హీరో గా చేసిన ‘సలాగా’ అనే చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.. సుమారుగా కన్నడ లో 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం.. ప్రస్తుతం ఆయన ‘భీమా’ అనే చిత్రం లో నటిస్తున్నాడు.. ఈ సినిమాకి దర్శకుడు కూడా ఆయనే. మన టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా నటించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘సింహాద్రి’ సినిమాని దునియా విజయ్ 2010వ సంవత్సరం లో ‘కంఠీరవ’ పేరుతో కన్నడలో రీమేక్ చేసాడు..తెలుగులో ఎంత పెద్ద హిట్ అయ్యిందో చిత్రం కన్నడలో మాత్రం ఆదరణ దక్కలేదు.

    -టాలీవుడ్ లోకి ఎంట్రీ
    కిచ్చా సుదీప్ లాగానే దునియా విజయ్ కూడా టాలీవుడ్ లో విలన్ గానే పరిచయం అయ్యాడు.. ఈ సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ గా నిలిచినా ‘వీరసింహారెడ్డి’ చిత్రంలో విలన్ గా నటించి మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం దునియా విజయ్ కు టాలీవుడ్ లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని సినిమాలు చేస్తాడో లేదో చూడాలి.

    Veera Simha Reddy Villain Duniya Vijay