Veera Simha Reddy collections : నందమూరి బాలకృష్ణ జాతకం ప్రస్తుతం మహర్దశలో నడుస్తుందనే చెప్పాలి.. ఆయన ఏది ముట్టుకున్నా అది బంగారం లాగా మారిపోతుంది..’అఖండ’ చిత్రం తర్వాత ఈ హీరో రేంజ్ స్టార్ హీరోలతో సరిసమానం అయ్యింది.. అంతకు ముందు బాలయ్య సినిమాలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ పాతిక కోట్ల రూపాయలకు మించి జరిగేది కాదు..కానీ ఇప్పుడు ‘వీర సింహా రెడ్డి’ చిత్రానికి ఏకంగా 75 కోట్ల రూపాయలకు జరగడం ఒక విశేషం అయితే మొదటి వారంలోనే సుమారుగా 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించడం మరో విశేషం.
డివైడ్ టాక్ తో ప్రారంభం అయ్యినప్పటికీ కూడా సంక్రాంతి సెలవులు బాగా కలిసి రావడంతో కమర్షియల్ గా బాగా వర్కౌట్ అయ్యింది.. ఒకపక్క ‘వాల్తేరు వీరయ్య’ ప్రభంజనం కొనసాగుతున్నా కూడా ‘వీర సింహా రెడ్డి’ తన ఉనికిని చాటుకుంటూ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టింది.. వారం రోజులకు కలిపి ప్రాంతాలవారీగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు చూద్దాం.
ప్రాంతం: వసూళ్లు(షేర్):
నైజాం 15.10 కోట్లు
సీడెడ్ 15.00 కోట్లు
ఉత్తరాంధ్ర 6.30 కోట్లు
ఈస్ట్ 5.00 కోట్లు
వెస్ట్ 3.80 కోట్లు
నెల్లూరు 2.55 కోట్లు
గుంటూరు 6.00 కోట్లు
కృష్ణ 4.27 కోట్లు
———————
మొత్తం 58.02 కోట్లు
ఓవర్సీస్ 5.30కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 4.05 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 67.37 కోట్లు
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 75 కోట్ల రూపాయలకు జరిగింది.. ఈ 75 కోట్ల రూపాయలకు గాను మొదటి వారం దాదాపుగా 68 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.. ఈ వీకెండ్ కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు వచ్చే అవకాశం ఉన్నందున్న బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేస్తుంది.. ఫుల్ రన్ లో మరో 5 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి 80 కోట్ల రూపాయిల షేర్ మార్కు దాటినా సినిమాలలో లిస్ట్ లో ‘వీర సింహా రెడ్డి’ చిత్రం నిలిచిపోతుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.