Varuntej – Lavanya : మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి నెలకొంది. హీరో వరుణ్ తేజ్ వివాహం ఘనంగా ముగిసింది. హీరోయిన్ లావణ్యను చాలా కాలంగా ప్రేమిస్తున్న వరుణ్ ఆమెను భార్యగా చేసుకున్నారు. వీరి పెళ్ళికి ఇటలీ దేశం వేదికైంది. డెస్టినేషన్ వెడ్డింగ్ ఘనంగా ప్లాన్ చేశారు. ఓ వారం రోజుల క్రితమే వధూవరులు, కుటుంబ సభ్యులు ఇటలీ చేరుకున్నారు. సోమవారం నుండి పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. సోమవారం రాత్రి కాక్ టైల్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో సూట్ లో వరుణ్, ఫ్రాక్ లో లావణ్య మెస్మరైజ్ చేశారు.

పార్టీ కల్చర్ కి తగ్గట్లు మెగా హీరోలు కూడా సూట్స్ లో హాజరయ్యారు. ఇక మంగళవారం హల్దీ వేడుక జరిగింది. వరుణ్ పసుపు రంగు కుర్తా, తెలుపు ప్యాంటు ధరించారు. లావణ్య పసుపు రంగు లెహంగాలో మెరిసింది. బుధవారం పెళ్లి ముహూర్తం. రాత్రి 7:18 నిమిషాలకు వరుణ్ తేజ్ తన ప్రేయసి లావణ్య మెడలో మూడు ముళ్ళు వేశాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో లావణ్య-వరుణ్ ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు.

ఈ పెళ్లికి సంబంధించిన కొన్ని ఆసక్తికర ఫొటోలు రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా వరుణ్ తేజ్ లావణ్య మెడలో తాళి కడుతున్న ఫొటోతోపాటు వారిద్దరూ కలిసి నడిచేవి.. రాంచరణ్ దంపతులతో దిగిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. వరుణ్ లావణ్య పెళ్లి ఫొటోలను మీరు ఇప్పుడు చూడొచ్చు..

