Varun Tej Lavanya Tripathi : మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలా నిశ్చితార్థం ఈ మద్య ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. సీక్రెట్ గా కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట డైరెక్ట్ గా నిశ్చితార్థం వార్తతో అందరినీ షాక్ కు గురి చేశారు. మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ మధ్యే ఈ నిశ్చితార్థం జరిగింది. దీంతో వీరి పెళ్లి కోసం మెగా అభిమానులు ఫుల్ గా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు పెళ్లి జరుగుతుంది అబ్బా అంటూ తెగ కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే వీరి పెళ్లికి సంబందించి ఓ అప్డేట్ వచ్చేసింది.

బాలీవుడ్ లో చాలా ఫేమస్ అయినా డిజైనర్ మనీష్ మల్హోత్రా వద్దకు వెళ్లి తమ పెళ్లి బట్టలు కూడా డిజైనింగ్ కి ఆర్డర్ ఇచ్చారు ఈ జంట.అయితే వీరి పెళ్లి ఈ నెల లేదా వచ్చే నెలలో ఉంటుందని టాక్. ఇదిలా ఉంటే నిన్న రాత్రి వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ కి చరణ్, ఉపాసన, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్.. ఇలా మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ, అల్లు ఫ్యామిల మధ్య ఈ సెలబ్రేషన్స్ జరిగాయి.
వీటికి సంబందించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో పంచుకున్నారు. ఇలా పోస్ట్ చేశారో లేదో అలా వైరల్ అయ్యాయి. దీంతో మా ఎదురుచూపులు మీ పెళ్లి కోసమే అంటూ మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అంతే కాదు మెగా ఫ్యామిలీకి తగినటువంటి కోడలు రాబోతుంది అంటూ లావణ్యను కొనియాడుతున్నారు కూడా.
About Last evening ..
Pre Wedding Celebrations of @IAmVarunTej & @Itslavanya #MomentsToCherish pic.twitter.com/TwUqaSUmXD
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 7, 2023