Varuntej – Lavanya : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ కి ఉండే క్రేజ్ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది హీరోలు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి క్రమంలో మెగా హీరోలకి సంబంధించిన ఏ చిన్న విషయమైనా కూడా వాళ్ళ అభిమానులతో పంచుకుంటూ అభిమానులను హ్యాపీగా ఉంచే విధంగా అన్ని రకాల ఈవెంట్స్ ని గాని ,వాళ్ళ జీవితంలో జరిగే ఫంక్షన్స్ ని గాని అభిమానులకు తెలియజేస్తూ ఉంటారు.ఇక ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లి గురించి చాలా రోజుల నుంచి చర్చ నడుస్తోంది. చాలా రోజుల నుంచి వీళ్ళ పెళ్లి ఎప్పుడూ అనేదాని మీద ఒక సస్పెన్స్ ని కొనసాగిస్తూ వస్తున్నారు.
ఇక ఇలాంటి క్రమంలో వీళ్ళ పెళ్లి ఎప్పుడు అనే దానికి సంబంధించిన డేట్ కూడా బయటికి రావడం జరిగింది. ఇక అందులో భాగంగానే వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి ల శుభలేఖ కూడా నెట్ లో ఇప్పుడు హల్చల్ చేస్తుంది.ఈ క్రమంలో అక్టోబర్ 30 వ తేదీ నుంచి ఇటలీలో వీళ్ల పెళ్లి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇక నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీ నగరంలో వీళ్ళిద్దరి పెళ్లి జరగనున్నట్టుగా తెలుస్తుంది.
ఇక వీళ్ల శుభలేఖ ని ఒకసారి చూసుకున్నట్లయితే శుభలేఖలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వాళ్ల నానమ్మ తాతయ్యల పేర్లని చాలా రీచ్ గా డిజైన్ చేశారు.ఇక వాళ్ల పెదనాన్న పెద్దమ్మలు అయిన చిరంజీవి, సురేఖల పేర్లు కూడా మెన్షన్ చేశారు. అలాగే అమ్మ నాన్న పేర్లని, పవన్ కళ్యాణ్ పేరుని, రామ్ చరణ్ ,ఉపాసన పేర్లను సపరేట్ గా మెన్షన్ చేశారు. పెళ్లికి పెద్దలుగా ఉపాసన రాంచరణ్ వ్యవహరించనున్నట్టు గా తెలుస్తుంది. ఇక వీళ్ళు ఇప్పటికే ఇటలీ నగరానికి వెళ్లి పెళ్లికి సంబంధించిన పనులను చేయడంలో చాలా బిజీగా గడుపుతున్నట్టుగా తెలుస్తుంది. దాని కోసమే రామ్ చరణ్ షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చినట్టు గా తెలుస్తుంది. వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి ల పెళ్లి పనులను చూసుకుంటూ రామ్ చరణ్ ,ఉపాసన బిజీగా ఉన్నారు..
ఇక ఈనెల 30వ తేదీన పెళ్లి ఉండడంతో మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి అక్టోబర్ 27న ఇటలీ బయలుదేరి వెళుతున్నారు. అయితే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి ల పెళ్లికి పవన్ కళ్యాణ్ వెళ్తాడా లేదా అనే విషయం పైన క్లారిటీ రావడం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలకి సంబంధించిన వ్యవహారాల్లో చాలా క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీని బలోపతం చేసే పనిగా ముందుకు దూసుకెళ్తున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇటలీ వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక పెళ్లి కార్యక్రమాలు అంతా ముగిసిన తర్వాత నవంబర్ 5న హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ హాల్ లో భారీ ఎత్తున రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు పలువురు సినీ సెలబ్రిటీస్ లతో పాటు గా పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరుకానున్నారని తెలుస్తుంది…
