Kriti Sanon- Prabhas: దేశవ్యాప్తంగా ఇప్పుడు ఓ న్యూస్ ప్రకంపనలు రేపుతోంది. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్.. ప్రభాస్-కృతి సనన్ ఎఫైర్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. దీంతో ప్రభాస్ మరోసారి ఎఫైర్, పెళ్లి రూమర్స్ ఎదుర్కొంటున్నారు. ప్రభాస్ మనసులో కృతి సనన్ ఉన్నారని వరుణ్ ధావన్ పరోక్షంగా చెప్పాడు. విషయంలోకి వెళితే… కృతి సనన్-వరుణ్ ధావన్ జంటగా బేడియా టైటిల్ తో హారర్ మూవీ విడుదలైంది. తెలుగులో ఈ చిత్రాన్ని తోడేలు గా విడుదల చేశారు. తోడేలు చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ ధావన్-కృతి ఒక రియాలిటీ షోలో పాల్గొన్నారు.

ఈ షో యాంకర్ గా బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఉన్నారు. ఆయన వరుణ్ ని ఒక ప్రశ్న అడిగారు. నీ గుండెల్లో కృతిసనన్ పేరు ఎందుకు లేదు? అని ప్రశ్నించారు. దానికి వరుణ్, కారణం ఏమిటంటే మరొకరి మనసులో కృతి పేరు ఉంది. ఆయన ముంబైలో లేడు. మరొక చోట దీపికా పదుకొనెతో పాటు షూటింగ్ చేస్తున్నాడు, అని చెప్పాడు. వరుణ్ కామెంట్ కి కృతితో పాటు వేదికపై ఉన్నవారు షాక్ కి గురయ్యారు. ఇక్కడ వరుణ్ ప్రభాస్ గురించే చెప్పాడని క్లియర్ గా అర్థం అవుతుంది.
ప్రాజెక్ట్ కే షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఇక ఆ చిత్ర హీరోయిన్ దీపికా పదుకొనె అన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి వరుణ్ ఇచ్చిన హింట్ ఖచ్చితంగా ప్రభాస్ గురించే. దీంతో ప్రభాస్-కృతి సనన్ ప్రేమించుకుంటున్నారని వరుణ్ స్పష్టత ఇచ్చినట్లు అయ్యింది. దానికి తోడు ఇటీవల ప్రభాస్ తో నేను పెళ్ళికి సిద్ధమని కృతి సనన్ అన్నారు. ఇక ఆదిపురుష్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ముఖానికి చెమటతో ప్రభాస్ ఇబ్బంది పడుతుంటే… కృతి తుడుచుకో అన్నట్లు ఆమె చీర చెంగు ఇవ్వబోయింది. ఇది మీడియాను ఎట్రాక్ట్ చేసింది.

ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే ప్రభాస్-కృతి మధ్య ఎఫైర్ నిజమేనేమో అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఆదిపురుష్ లో ప్రభాస్,కృతి సనన్ సీతారాముల పాత్రలు చేస్తున్నారు. ఆ చిత్ర సెట్స్ లోనే వీరి బంధానికి బీజం పడింది అంటున్నారు. అందులోనూ ప్రభాస్ తన సహనటి ఎవరైనా చాలా ప్రేమగా చూసుకుంటాడు. అరుదైన వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేస్తాడు. ప్రభాస్ ఆతిధ్యానికి కృతి పడిపోయి ఉండొచ్చు. కాగా ప్రభాస్, అనుష్క మధ్య లవ్ ఎఫైర్ ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది.