
Anchor Varshini IPL: వర్షిణి సౌందరరాజన్.. తెలుగు బుల్లితెరకు పెద్దగా పరిచయం చేయనక్కర లేని పేరు. ఆకట్టుకునే అందం, అంతకుమించిన శరీర సౌష్టవంతో పలు చానలల్లో ఈ అమ్మడు యాంకర్ గా పని చేసింది. వెటరన్ హీరో సుమంత్ తో కలిసి ఒక సినిమాలో కూడా నటించింది. జీ తెలుగు నిర్మించిన వెబ్ సిరీస్ లో కూడా ఫీ మేల్ లీడ్ రోల్ లో నటించింది. అలాంటి ఈ అమ్మడికి ఈమధ్య అవకాశాలు లేకుండా పోయాయి. ఏదో అడపా దడపా గా మా టీవీలో కనిపిస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నది. ఆ మధ్య హైపర్ ఆది బర్త్ డే లో పాల్గొన్నది. అతడికి ఓ ముద్దు ఇచ్చి, ఐ లవ్యూ అంటూ ఇన్ స్టా గ్రామ్ లో రాసికొచ్చింది. తర్వాత ఇద్దరూ కలిసింది లేదు. కానీ మొన్న సిక్స్త్ సెన్స్ -6 లో కనిపించారు.. పొట్టి డెనిమ్ షార్ట్ లో వర్షిణి ఆ షో కు వచ్చింది. థండర్ థై షో చేసింది. ఆది అయితే ఆ షో లో ఏకంగా ఆమెను అమాంతం ఎత్తుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య ఘాటైన బంధం ఉందని ప్రేక్షకులకు అర్థమైంది. కానీ అంతలోనే వర్షిణి అనుకోని ట్విస్ట్ ఇచ్చింది.
నిన్న హైదరాబాదులో ముంబై ఇండియన్స్, హైదరాబాద్ సన్రైజర్స్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో వర్షిణి సందడి చేసింది. యద ఎత్తులు కనిపించేలా వైట్ టాప్, స్లీవ్ డెనిమ్ జీన్స్ వేసి స్టేడియాన్ని హోరెత్తించింది. అయితే ఈ క్రమంలో ముంబై జట్టు క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ తో పిచ్చాపాటి గా మాట్లాడింది.. అతడితో కలిసి నవ్వులు చిందించింది. తర్వాత ఇద్దరూ కలిసి ఒక సెల్ఫీ దిగారు. ఈ ఫొటోను వర్షిణి ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. హైదరాబాద్ జట్టుకు సపోర్ట్ చేస్తూనే.. ముంబై క్రికెటర్ తో చెట్టాపట్టాలేసుకొని తిరిగింది.

దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు..”అది కి ఐ లవ్యూ చెప్పావు. ఇప్పుడేంటి ముంబై క్రికెటర్ తో ఇలా ఫోజులు ఇస్తున్నావు” అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు..” సూర్య కుమార్ యాదవ్ కు పెళ్లయింది. అతడిని వదిలిపెట్టు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే ” మిస్టర్ 360 డిగ్రీలతో కలిసి 360 డిగ్రీలు తిరుగు అంటూ” వ్యాఖ్యానిస్తున్నారు. కొంటె నెటిజన్లు అయితే ” నీ మాయలో పడి సూర్య 7 పరుగులు మాత్రమే చేశాడు. ఇంకో మ్యాచ్ కో అతడిని కలవకు. ప్లీజ్ అంటూ” బతిమిలాడుతున్నారు. మొత్తానికి సూర్యతో కలిసి వర్షిణి దిగిన సెల్ఫీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మరి ఈ ఫోటో చూసి హైపర్ ఆది ఎలా స్పందిస్తాడో వేచి చూడాలని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.