Varsha Emmanuel : సుడిగాలి సుధీర్-రష్మీ గౌతమ్ బుల్లితెర క్రేజీ లవ్ బర్డ్స్ గా ఉన్నారు. వారి తర్వాత ఆ రేంజ్ లో ఫేమస్ అయ్యారు వర్ష-ఇమ్మానియేల్. లవర్స్ అనే ఇమేజ్ వీరిద్దరి కెరీర్ సెట్ చేసింది. మంచిగా అవకాశాలు తెచ్చిపెట్టింది. సీరియల్ యాక్టర్ అని వర్ష జబర్దస్త్ కి వచ్చారు. ఏళ్లుగా సీరియల్స్ లో నటిస్తున్నా రాని గుర్తింపు జబర్దస్త్ షోతో వర్ష సొంతం చేసుకుంది. సాధారణంగా జబర్దస్త్ లో లేడీ క్యారెక్టర్స్ అబ్బాయిలే వేస్తారు. వారు ఎంత దారుణంగా ఉంటారంటే చెప్పడం కూడా కష్టమే.
వినోద్, ప్రియాంకతో పాటు ఒకరిద్దరు లేడీ గెటప్స్ లో అందంగా ఉంటారు. దీంతో సన్నజాజి తీగలా నాజూగ్గా ఉండే వర్ష గ్లామర్ కి జబర్దస్త్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. చాలా త్వరగా వర్ష జబర్దస్త్ లేడీ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇమ్మానియేల్ తో ఆమె రొమాన్స్, కెమిస్ట్రీ హైలెట్ అయ్యాయి. నల్ల బాలుడు ఇమ్మానియల్ వెనుక పడే చందమామగా వర్ష పిచ్చ పాపులర్ అయ్యారు. ఇక తనని తాను ఇమ్మానియేల్ లవర్ గా ప్రొజెక్ట్ చేసుకుంటుంది.
ఇమ్మానియేల్ అంటే తనకు అమితమైన ప్రేమ అని వర్ష పలు సందర్భాల్లో చెప్పారు. జీవితంలో అతన్ని వదిలేది లేదని పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తుంది. ఇటీవల వర్షను నగల దుకాణానికి తీసుకెళ్లి ఇమ్మానియల్ గిఫ్ట్ ఇచ్చాడు. వర్ష, ఇమ్మానియేల్ నిజంగా ప్రేమించుకుంటున్నారా? లేక కెరీర్ కోసం అలా నటిస్తున్నారా? అనే సందేహం జనాల్లో ఉంది. దీనిపై ఒకటి రెండు సార్లు ఇమ్మానియేల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మా రొమాన్స్ బుల్లితెర వరకే అని చెప్పాడు.
లవర్స్ మాదిరి వీరు అప్పుడప్పుడు గొడవలు పడతారు. వారి గిల్లికజ్జాలు చూస్తుంటే, ఎస్ వాళ్ళు ప్రేమికులే అని చెప్పాలి అనిపిస్తుంది. అయితే వర్షకు ఒక మాట అంటే ఎక్కడ లేని కోపం వస్తుంది. జబర్దస్త్ కమెడియన్స్ వర్షను అప్పుడప్పుడు లేడీ గెటప్ అంటూ ఆటపట్టిస్తూ ఉంటారు. ఆ మాటకు వర్ష పైకి నవ్వినా లోపల బాధపడుతుంది. ఒకసారి ఇమ్మానియేల్ లేడీ గెటప్ అనడంతో ఫైర్ అయ్యింది. అతనిపై కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. తాజాగా మరోసారి ఇమ్మానియేల్ అదే కామెంట్ చేశాడు. స్కిట్ లో భాగంగా.. వర్ష ఇమ్మానియేల్ తో ‘నేను ఉండగా మరొక అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు?’ అని డైలాగ్ చెబుతుంది.
నిన్ను పెళ్లి చేసుకున్నాక తెలిసింది అమ్మాయి కాదని, అందుకే వేరే అమ్మాయిని చేసుకున్నా, అని ఇమ్మానియల్ డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగ్ కి వర్ష ముఖం సీరియస్ గా మారిపోయింది. కాగా వర్ష వాయిస్, ఆమె బాడీ లాంగ్వేజ్ రీత్యా… జెండర్ పై అనుమానాలు ఉన్నాయి.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Varsha is not a girl lover emmanuels sensational comments
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com