https://oktelugu.com/

Valentine Agreement: భార్యాభర్తల మధ్య విచిత్రమైన అగ్రిమెంట్.. బెడ్ రూంలో అలాంటివి చేయెద్దట

పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనయ, శుభమ్ అనే జంట వారి వివాహం తర్వాత రెండు సంవత్సరాలకు ప్రేమికుల దినోత్సవం నాడు ఈ ఒప్పందంపై సంతకం చేశారు.

Written By: , Updated On : February 15, 2025 / 08:22 PM IST
Valentine Agreement

Valentine Agreement

Follow us on

Valentine Agreement: ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులు ఫిబ్రవరి 14ను తమ జీవితాంతం గుర్తుండిపోయే వేడుకలు జరుపుకుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు మాత్రం ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుని పార్టీలు ఏర్పాటు చేసుకుంటారు. అయితే, పెళ్లికాని జంట చేసుకున్న ఒక విచిత్రమైన అగ్రిమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్యాభర్తలు కూడా అలాంటి ఒప్పందాలు చేసుకుంటారా అని ఆశ్చర్యపోతారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒప్పందంలో భార్యభర్తలు పెట్టుకున్న కండీషన్లు చదివే నవ్వు రాకమానదు.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనయ, శుభమ్ అనే జంట వారి వివాహం తర్వాత రెండు సంవత్సరాలకు ప్రేమికుల దినోత్సవం నాడు ఈ ఒప్పందంపై సంతకం చేశారు. వారు రూ. 500 బాండ్ పేపర్‌పై ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇందులో అనయ తన భర్త శుభమ్‌ పై కొన్ని షరతులు విధించింది.

భర్తకు భార్య పెట్టిన షరతులు:
* భోజనం చేసేటప్పుడు కుటుంబ సంబంధ విషయాలే మాత్రమే మాట్లాడాలి, స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడకూడదు.
* బెడ్రూమ్‌లో స్టాక్ మార్కెట్ లాభాలు, నష్టాలు గురించి మాట్లాడకూడదు.
* భర్త (అనయ) తనను “బ్యూటీ కాయిన్” లేదా “క్రిప్టో పై” అని పిలవడం మానేయాలి.

భోజన సమయంలో కుటుంబ విషయాలు మాత్రమే మాట్లాడాలి. ఎలాంటి ట్రేడింగ్ గురించి మాట్లాడకూడదని పేర్కొంది. బెడ్‌రూమ్‌లో స్టాక్ మార్కెట్ లాభాలు, నష్టాల గురించి ఇద్దరి మధ్య చర్చలు రావొద్దని స్పష్టం చేసింది. తనను ‘బ్యూటీ కాయిన్’, ‘క్రిప్టో పై’ అని పిలవడం మానేయాలని సూచించింది. రాత్రి 9 గంటల తర్వాత ట్రేడింగ్ యాప్‌లు, వీడియోలను చూడకూడదని ఆమె తన భర్తకు కండీషన్ పెట్టింది.

భార్యకు భర్త పెట్టిన షరతులు:
* భార్య (అనయ) తన ప్రవర్తన గురించి అమ్మకు ఫిర్యాదు చేయకూడదు.
* గొడవ జరిగినప్పుడు తన మాజీ ప్రేయసిని ప్రస్తావించకూడదు.
* ఖరీదైన స్కిన్ కేర్ ఉత్పత్తులను కొనకూడదు.
* రాత్రి ఆర్డర్ చేసే ఫుడ్‌కు స్విగ్గీ, జొమాటో వంటి ఆప్లికేషన్లు ఉపయోగించకూడదు.

అదేవిధంగా, భర్త కూడా తన భార్యకు కొన్ని షరతులు విధించాడు. ఆమె తన ప్రవర్తన గురించి తన తల్లికి ఫిర్యాదు చేయడం మానుకోవాలి. వాదనల సమయంలో ఆమె తన మాజీ ప్రేయసి గురించి ప్రస్తావించకూడదు. ఆమె ఖరీదైన చర్మ సంరక్షణ ఉత్పత్తులను కొనకూడదు. రాత్రిపూట స్విగ్గీ, జొమాటో నుండి ఆహారాన్ని ఆర్డర్ చేయకూడదని కండీషన్ పెట్టుకున్నారు.

ఎవరైనా ఈ షరతులను ఉల్లంఘిస్తే, వారు మూడు నెలల పాటు బట్టలు ఉతకాలి, టాయిలెట్లు శుభ్రం చేయాలి. ఇంటికి అవసరమైన వస్తువులను తీసుకురావాలి అని వారు రాశారు. ఈ వినూత్న ఒప్పందం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.