
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ ట్రైలర్ కు టైం దగ్గరపడింది. ఈ సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ ను లాంచ్ చేయబోతున్నారు. అంతకంటే ముందే ఫ్యాన్స్ హంగామా మొదలుపెట్టారు. ఎక్కడి చూసినా ఇప్పుడు ఈ ట్రైలర్ గురించే. ప్రస్తుతం ట్విట్టర్ లో ఇదే ట్రెండ్ అవుతోంది.
రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ సినిమాలు వదిలేశాడు. మళ్లీ మూడు సంవత్సరాల తరువాత పవన్ రీఎంట్రీ ఇచ్చి తీసిన తొలి మూవీ ‘వకీల్ సాబ్’. ఇటీవలే వకీల్ సాబ్ చిత్రం డబ్బింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం కావడంతో ఫ్యాన్స్ ఈ టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు.. ఇందులో భాగంగా తాజాగా విడుదలయిన పవర్ స్టార్ కొన్ని ఫొటోలు ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి.. వకీల్ సాబ్ పిక్స్, టీజర్ పై ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. చూసిన వాళ్లంతా ఫుల్ ఎమోషనల్ గా ఫీలవతున్నారు. తమ అభిమాన హీరో పవన్ ను ట్రైలర్లో చూస్తే ఇంకా ఎంత బాగుంటుందో అని సంబరపడిపోతున్నారు.
మూడేళ్ల తరువాత మళ్లీ వెండితెరపై కనిపించనున్నాడని ఫ్యాన్స్ తెలిసి ఉబ్బితబ్బైపోయారు. ‘వకీల్ సాబ్’ సినిమా ప్రారంభం నుంచే పవన్ కటౌట్లు, ఫ్లెక్సీలతో పండుగ చేస్తున్నారు. ఆయన పిక్స్, ఇమేజ్ లతో సోషల్ మీడియాలో రచ్చ చేశారు. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమా తరువాత పవన్ సినిమాలు పెద్దగా ఆడలేదు. ఆ తరువాత వచ్చిన అజ్ఞాతవాసి ఆకట్టుకోలేదు. ఇప్పుడు వకీల్ సాబ్ పై బోలెడు అంచనాలున్నాయి.
తాజాగా విడులయిన కొన్ని సీన్లలో పవన్ ను చూసిన అభిమానులు దీన్ని తెగ షేర్లు చేస్తూ ఆయన పోస్టర్లకు పాలాభిషేకం చేస్తున్నారు.ట్రైలర్ లో పవన్ నటన అనుకున్నదానికంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమా కూడా కచ్చితంగా విజయం సాధిస్తుందని అంటున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లో పవన్ కోర్టు వేసుకొని ఎంట్రీ ఇవ్వడం అద్భుతంగా ఉంటుందట… ఎమోషనల్ డైలగ్స్ తో అదరగొట్టాడు. ఇక ఫైట్స్ షరా మాములే. మరోవైపు శృతి హాసన్ తో ఉన్న సీన్స్ అలరించాయి. ఈ ట్రైలర్ లో పవన్ ఓ వైప్ ఎమోషనల్ గానే కనిపిస్తూనే మరోవైపు లవర్ బాయ్ గా అలరించనున్నాడు.
Trailer will be out today at 6PM.
Get Ready for Power-Packed trailer.#VakeelSaabTrailerDay pic.twitter.com/l3wyuVil0n— ⏳⏳⏳ (@TrendPSPKTeam) March 29, 2021