
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా తెరకెక్కబోతుందనే విషయం మన అందరికీ తెలిసిందే. గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా ఇది. ఎప్పటి నుండో ప్రారంభం అవ్వాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ ఎట్టకేలకు నేడు రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకుంది.
ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ దాదాపుగా 90 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడట.’హరి హర వీరమల్లు’ సినిమా తర్వాత రీసెంట్ సమయం లో పవన్ కళ్యాణ్ ఒక సినిమాకి ఇన్ని రోజులు డేట్స్ ఇవ్వడం దీనికే జరిగింది. అయితే ఈరోజు ప్రారంభం అయ్యే మొదటి షెడ్యూల్ కేవలం పది రోజులు మాత్రమే కొనసాగనుంది. ఈ సినిమాలో ఇప్పటికే శ్రీలీల హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ఆమె కూడా ఈ మొదటి షెడ్యూల్ లో పాల్గొనబోతుందట.
అయితే మొదటి నుని ఈ సినిమా తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన తేరి చిత్రానికి రీమేక్ అంటూ ప్రచారం సాగింది. అందులో ఎలాంటి నిజం లేదట, కేవలం తేరి మూవీ స్టోరీ లైన్ ని తీసుకొని, మొత్తం మార్చేసి ఒక కొత్త సినిమాలాగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. పవన్ కళ్యాణ్ ని ఎలా చూపిస్తే థియేటర్స్ షేక్ అవుతాయి అనేది పెర్ఫెక్టుగా తెలిసిన ఏకైక డైరెక్టర్ హరీష్ శంకర్ మాత్రమే. అందుకే ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాస్తుంది అనే నమ్మకం తో ఉన్నారు ఫ్యాన్స్.

ఈ ఏడాది లోపు షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే లక్ష్యం తో పని చేయబోతున్నాడట హరీష్ శంకర్. అందుకు తగ్గట్టుగానే షెడ్యూల్స్ ని కూడా ప్లాన్ చేసాడట. అదే సంక్రాంతి సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కూడా రాబోతుంది. అన్నీ అనుకున్నట్టే జరిగితే పవర్ స్టార్ మరియు సూపర్ స్టార్ బాక్స్ ఆఫీస్ వార్ ని చూడబోతున్నాము అన్నమాట.