https://oktelugu.com/

Urvasivo Rakshasivo Teaser : ముద్దులు.. రోమాన్స్.. అల్లు శిరీష్ ను వాడుకొని వదిలేసిన హీరోయిన్!

Urvasivo Rakshasivo Teaser : ‘పుష్ప’తో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగితే ఆయన తమ్ముడు అల్లు శిరీష్ మాత్రం ఒక్క హిట్ కోసం బాగా ట్రై చేస్తున్నాడు. ఎలాంటి సినిమాలు తీసినా ఆడకపోవడంతో ఇక ఇప్పుడు ఏకంగా రోమాటింగ్ మూవీల్లో ఒదిగిపోయాడు. ‘ఊర్వశివో.. రాక్షసివో’ అంటూ మనముందుకు వస్తున్నాడు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు శిరీష్ , అను ఇమ్మాన్యూయేల్ హీరో హీరోయిన్లుగా రాకేష్ శశి దర్శకత్వంలో రూపొందిన మూవీ ఇదీ.. ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 29, 2022 / 06:54 PM IST
    Follow us on

    Urvasivo Rakshasivo Teaser : ‘పుష్ప’తో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగితే ఆయన తమ్ముడు అల్లు శిరీష్ మాత్రం ఒక్క హిట్ కోసం బాగా ట్రై చేస్తున్నాడు. ఎలాంటి సినిమాలు తీసినా ఆడకపోవడంతో ఇక ఇప్పుడు ఏకంగా రోమాటింగ్ మూవీల్లో ఒదిగిపోయాడు. ‘ఊర్వశివో.. రాక్షసివో’ అంటూ మనముందుకు వస్తున్నాడు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు శిరీష్ , అను ఇమ్మాన్యూయేల్ హీరో హీరోయిన్లుగా రాకేష్ శశి దర్శకత్వంలో రూపొందిన మూవీ ఇదీ.. ఈ సినిమాలో ఫక్తు ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మధ్య ప్రేమ చాటున చేసుకున్న రోమాన్స్ నే మొత్తం చూపించారు. జస్ట్ యూజ్ అండ్ త్రో అని.. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేని జంట స్టోరీని కథగా మలిచారు.

    అల్లు శిరీష్ ఇలాంటి బోల్డ్ చిత్రంలో ఎందుకు నటించారో అర్థం కాకుండా ఉంది. ప్రేమ కథలు, కుటుంబ కథా చిత్రాలు తీసి చేతులు కాల్చుకున్న హీరో ఇప్పుడు ఫక్తు బూతు సినిమాను ఎంచుకున్నాడు. హీరోయిన్ అను ఇమ్మాన్యూయేల్ తో లిఫ్ట్ లో మొదలైన ముద్దుల ప్రవాహం.. ఆ తర్వాత ఆఫీసులో ప్రేమగా మారి ఓ వర్షం పడుతున్న రాత్రి వీరిద్దరూ శృంగారంతో రెచ్చిపోయే వరకూ సాగుతుంది.

    అనంతరం శృంగారం వరకేనని.. ఇది ప్రేమ, పెళ్లికి తావు లేదని హీరో అల్లు శిరీష్ కు హీరోయిన్ షాక్ ఇవ్వడంతో ఇంటర్వెల్ పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఆ అనుభవించిన హీరోయిన్ కోసం హీరో పడే పాట్లను ట్విస్టింగ్ గా ట్రైలర్ లో చూపించారు.

    ఇలాంటి బోల్డ్ కథను కొడుకు కోసం అల్లు అరవింద్ ఎంపిక చేయడం.. దాన్ని ఎలా నిర్మించడాన్నది అర్థం కాకుండా ఉంది.. అసలు ఈ ట్రైలర్ నే ఫ్యామిలీతో చూడలేకుండా ఉంది. ఇక థియేటర్లో చూడడం కష్టం. సినిమాను ఫక్తు యూత్ ఫుల్ రోమాంటిక్ ఎంటర్ టైనర్ గా మలిచారు. నవంబర్ 4న ఈ చిత్రాన్ని థియేటర్ లో విడుదల చేస్తున్నారు.