
Upendra Kabza Movie: ఒకప్పుడు మన టాలీవుడ్ లో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కి మంచి మార్కెట్ ఉండేది.ఆయన హీరో గా నటించిన ‘రా’, ‘ఉపేంద్ర’ వంటి సినిమాలు మన టాలీవుడ్ లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.అప్పటి నుండి ఆయనకీ ఇక్కడ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది.అప్పట్లో టాలీవుడ్ హీరో కి కట్టినట్టే బ్యానర్స్ మరియు ఫ్లెక్సీలు ఈయన సినిమాలు విడుదలైనప్పుడు కూడా కట్టేవారు.
ఆరోజుల్లో మనకి కన్నడ సినీ పరిశ్రమ అంటే ఉపేంద్ర మాత్రమే గుర్తుకు వచ్చేవాడు,అంతలా ఆయన తన ప్రభావం ని చూపాడు.అయితే ఈమధ్య కాలం లో ఆయన మార్కు సినిమాలు బాగా మిస్ అవుతున్నాయి.తెలుగు లో కూడా ఆయన మార్కెట్ పూర్తిగా పోయింది.అందుకే ఇప్పుడు మరోసారి భారీ లెవెల్ లో బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ‘కబ్జా’ అనే పాన్ ఇండియన్ సినిమా ద్వారా మన ముందుకు రాబోతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.కన్నడ సినీ పరిశ్రమకి KGF సిరీస్ మరియు కాంతారా ఎలా అయితే నిలిచాయో, కబ్జా చిత్రం కూడా అలా నిలిచిపోబోతుంది అంటున్నారు.ఇక ఈ సినిమాలో మరో కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా, శివ రాజ్ కుమార్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు.ఇక KGF సిరీస్ కి సంగీతం అందించిన రవి బస్రూర్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందించాడు.శ్రీయ శరన్ ఈ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది.ఇది ఇలా ఉండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి వంద కోట్ల రూపాయలకు పైగా జరిగిందట.

ఇక మన తెలుగు వెర్షన్ కి దాదాపుగా నాలుగు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది.అంటే ఈ సినిమా సూపర్ హిట్ సూపర్ హిట్ అవ్వాలంటే ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల రూపాయలకు పైగా వసూలు చెయ్యాలి అలాగే తెలుగు లో 5 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేయాలంటున్నారు విశ్లేషకులు.
