
Upasana Seemantham: రామ్ చరణ్ దంపతులు ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు. ఉపాసన సీమంతం సెలబ్రేషన్స్ లో భాగంగా అక్కడకు వెళ్ళినట్లు సమాచారం. ఉపాసన కుటుంబ సభ్యులు సైతం ఈ ట్రిప్ లో జాయిన్ అయ్యారు. ఉపాసన చెల్లెళ్ళు అనుష్పాల, సింధూరి సీమంతం వేడుక ఘనంగా నిర్వహించారు. తన హ్యాపీ నెస్ షేర్ చేస్తూ ఉపాసన ఓ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. దుబాయ్ లో జరిగిన సీమంతం వేడుకల వీడియో అభిమానులతో పంచుకోగా వైరల్ అవుతుంది. కాగా ఉపాసన సీమంతం దుబాయ్ లో జరపడమేంటీ? చరణ్ కుటుంబ సభ్యులు హాజరుకాకపోవడమేంటీ? అనే సందేహాలు తెరపైకి వచ్చాయి.
చరణ్ పేరెంట్స్ చిరంజీవి, సురేఖా కోడలు ఉపాసన సీమంతం వేడుకల్లో కనిపించలేదు. అత్యంత ముఖ్యమైన వేడుకలో అత్తమామలు లేకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే దీన్ని వివాదంగా చూడాల్సిన అవసరం లేదు. అధికారికంగా హైదరాబాద్ లో ఉపాసన సీమంతం ఘనంగా జరగనుంది. ఆ వేడుక చిరంజీవి, సురేఖల సమక్షంలో నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, సన్నిహితులు, ఇండస్ట్రీ వర్గాలు హాజరుకానున్నారని సమాచారం.
కేవలం ఉపాసన సిస్టర్స్ చిన్న వేడుకగా దుబాయ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా పెళ్ళైన పదేళ్లకు ఉపాసన తల్లి అయ్యారు. లేటుగా ఫ్యామిలీ ప్లానింగ్ చేయడం చేయడానికి కారణాలు తాజా ఇంటర్వ్యూలో ఉపాసన వెల్లడించారు. వివాహం జరిగిన వెంటనే చరణ్, నేను పదేళ్ల వరకూ పిల్లలు వద్దని నిర్ణయం తీసుకున్నాము. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు, సమాజం నుండి మాకు ఒత్తిడి ఎదురైంది. ఎలాంటి ప్రెజర్స్ కి తలొగ్గకుండా మా నిర్ణయం అమలు చేశాము.

ఇప్పుడు మేము మా రంగాల్లో ఉన్నత స్థాయి చేరాము. ఆర్థికంగా స్థిరపడ్డాము. మా పిల్లలకు అడిగింది ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నామంటూ… ఉపాసన చెప్పుకొచ్చారు. 2022 డిసెంబర్ 12న చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఉపాసన ప్రెగ్నెన్సీ మేటర్ బయటపెట్టారు. అభిమానులతో పంచుకున్నారు. ఎన్నాళ్ళగానో నిరీక్షిస్తున్న శుభవార్త కావడంతో మెగా అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. కొన్ని నెలల్లో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. మరోవైపు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఆయన ఫేమ్ ఇంటర్నేషనల్ వైడ్ పాకింది. ఏకంగా ఆస్కార్ గెలిచిన హీరోగా చరిత్రకు ఎక్కారు.
Soooooo grateful ❤️ for all the love.
Thank u my darling sisters & all our friends & family for the best baby shower. @AlwaysRamCharan pic.twitter.com/nfmxsXbGhM
— Upasana Konidela (@upasanakonidela) April 5, 2023