UP Police: ఈమధ్య ఎక్కడికి వెళ్లినా సెల్ఫీలు దిగుతున్నారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందమైన ప్రదేశం చూడగానే వెంటనే క్యాప్చర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి మరికొంతమంది వింత వింత ప్రయోగాలు చేస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. ఆ మధ్య ఓ హీరోయిన్ బాత్రూంలో సెల్పీలు దిగి సోషల్ మీడియాలో పెట్టడంతో రచ్చ రచ్చయింది. కానీ ఫుల్ పాపులారిటీ వచ్చింది. ఈ విషయాన్ని బాగా ఆలోచించిన ఓ ఎస్ ఐ భార్య సోషల్ మీడియాలో ట్రెండీగా కావాలని ఓ ప్రయోగం చేసింది. కానీ అది బెడిసికొట్టింది. చివరికి భర్తపై దర్యాప్తు తీసుకొచ్చేదాకా వచ్చింది. ఇంతకీ ఆ భార్య సెల్ఫీ ఎక్కడ దిగింది.
ఆయనో ఎస్ ఐ. ప్రజలు తప్పు చేస్తే వారిని సరైన దారిలో పెట్టే పోలీస్ విభాగంలో చేస్తున్నాడు. కానీ ఆయన భార్య తెలిసో.. తెలియకనో.. ఓ మిస్టేక్ చేసింది. సోషల్ మీడియాలో హైలెట్ కావడానికి తన ఇంట్లో ఉన్న డబ్బంతా బెడ్ పై పెట్టింది. అన్నీ రూ.500 నోట్ల కట్టలను వరుసగా పెట్టింది. అలా పెట్టి తాను, పిల్లలతో కలిసి సెల్ఫీ దిగింది. ఇలా దిని పిక్ ను 2021 నవంబర్ 14న పోస్టు చేసింది. అది కాస్త వైరల్ అయింది.
ఉత్తరప్రదేశ్ లోని బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న రమేష్ చంద్ర సహాని భార్య, పిల్లలు ఈ పోస్టు చేశారు. అయితే ఈ పిక్ చివరికి పోలీసు ఉన్నతాధికారుల వరకు చేసింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంట ఇంత డబ్బు ఎక్కడిది? అని పోలీసులు ఎంక్వైరీ చేయడానికి ఆదేశించారు. అయితే తాము ఆస్తిని విక్రయించగా వచ్చిన డబ్బు అంటూ ఎస్ ఐ భార్య సోషల్ మీడియాలో పేర్కొంది.
కానీ అధికారులు మాత్ర రమేష్ చంద్రపై విచారణ జరుపుతున్నారు. అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని వారు తెలుపుతున్నారు. ఏదీ ఏమైనా రమేస్ చంద్ర చేసిన భార్యపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇలా సెల్పీలు తీసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించరా? అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమెకు తెలియక ఈ మిస్టేక్ చేశారని చెప్పుకొస్తున్నారు.