Homeట్రెండింగ్ న్యూస్Uttar Pradesh: అమ్మాయి చావుకు కారణమయ్యారు.. యోగి మార్క్ కాల్పులకు ఆసుపత్రిలో దేకుతున్నారు

Uttar Pradesh: అమ్మాయి చావుకు కారణమయ్యారు.. యోగి మార్క్ కాల్పులకు ఆసుపత్రిలో దేకుతున్నారు

Uttar Pradesh: ఒకడు చచ్చాడు. ఇంకో ఇద్దరు ఆసుపత్రిలో దేకుతున్నారు. ఆయన వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఆసుపత్రిలో సిబ్బంది కనీసం మనుషుల్లాగా కూడా చూడటం లేదు. వారి కంటే మురికి గుంటలో పందులు నయం. చెత్త కుప్పలో ఎలుకలు నయం. ఎందుకంటే వారు చేసిన నేరం అటువంటిది. ఆ నేరానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వేసిన శిక్ష అటువంటిది. అయినవాళ్లు దగ్గరికి రానివ్వడం లేదు. తెలిసినవాళ్లు కనీసం పరామర్శించడం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు వాళ్లకు నా అనే వారు ఎవరూ లేరు. అందరూ ఉండగా అనాధలు అయిపోయారు. ఒకరకంగా చెప్పాలంటే బతికుండగానే నరకం చూస్తున్నారు. ఇంతకు వారు చేసిన నేరం ఏంటంటే..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అంబేద్కర్ నగర్ జిల్లాలో 17 ఏళ్ల బాలిక రోజు సైకిల్ మీద కాలేజీకి వెళ్లి వస్తూ ఉంటుంది. అయితే ఆ అమ్మాయిపై ఓ ఆకతాయి మంద కన్ను పడింది. పని పాట లేకపోవడంతో జులాయిలుగా తిరిగేవారు. అయితే రోజూ కాలేజీకి వెళ్లి వస్తున్న ఆ బాలికను ఈ జులాయి బ్యాచ్ లోని షజబాజ్, ఫైజల్, మైనర్ ద్విచక్ర వాహనాల మీద వెంబడించారు. ఈ క్రమంలో ఆమె చున్నీని ఒకడు లాగాడు. దీంతో ఆ బాలిక సైకిల్ మీద నుంచి కింద పడిపోయింది. కింద పడిపోయిన ఆ బాలిక మీద నుంచి ఒకడు మోటార్ సైకిల్ పోనిచ్చాడు. ఆమె తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఇక ఈ బాలిక మరణం నేపథ్యంలో నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే ఈ విషయం ముఖ్యమంత్రి యోగి దాకా చేరుకోవడంతో.. ఆయన పోలీసులతో “యమరాజ్” అమలు చేయాలని ఆదేశించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తన పని మొదలుపెట్టారు.

ఆ అమ్మాయి చావుకు కారణమైన వీడియో సీసీటీవీలో రికార్డయింది. దానిని చూసిన పోలీసులు నిందితులను గుర్తించారు. అయితే పోలీసులు తమను ఎలాగైనా అరెస్టు చేస్తారని భావించి భయపడిన నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు కాల్పులు జరపడంతో ఒక వ్యక్తి దవడ విరిగింది. తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఇద్దరికి కూడా తీవ్ర గాయాలు కావడంతో అంబేద్కర్ నగర్ జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. తమ పిల్లలు చేసిన తప్పు వల్ల తలవంపులు ఎదుర్కోవడంతో వారి తల్లిదండ్రులు ఆసుపత్రికి రావడం మానేశారు. వాళ్లు కనీసం పట్టించుకోలేదు. ఆసుపత్రి సిబ్బంది కూడా అంతంత మాత్రమే వైద్య చికిత్సలు అందిస్తుండడంతో వారు నేలపై దేకుకుంటూ వెళ్తున్నారు.. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ వైరల్ గా మారింది..”అమ్మాయి చావుకు కారణమైన వారి గతి చూడండి. యూపీలో యోగి మార్క్ పోలీస్ శిక్ష ఈ విధంగా ఉంటుంది” అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular