https://oktelugu.com/

Unstoppable with NBK: వైరల్ అవుతున్న త్రివిక్రమ్ తో బాలయ్య బాబు ఫోన్ కాల్ సంభాషణ..పవన్ కళ్యాణ్ తో ఇక్కడకి రా అంటూ బాలయ్య పిలుపు

Unstoppable with NBK నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఆహా ఓటీటీలో చేసిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో ఎంత పెద్ద సెన్షేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..ఇప్పుడు ఈ టాక్ షో కి సీజన్ 2 కూడా ఇటీవలే ప్రారంభం అయ్యింది..ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ కి బాలకృష్ణ గారి బావ మరియు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారాచంద్ర బాబు నాయుడు అతిథిగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ బ్లాక్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 16, 2022 / 06:18 PM IST
    Follow us on

    Unstoppable with NBK నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఆహా ఓటీటీలో చేసిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో ఎంత పెద్ద సెన్షేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..ఇప్పుడు ఈ టాక్ షో కి సీజన్ 2 కూడా ఇటీవలే ప్రారంభం అయ్యింది..ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ కి బాలకృష్ణ గారి బావ మరియు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారాచంద్ర బాబు నాయుడు అతిథిగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ బ్లాక్ బస్టర్ అయ్యింది..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఈ ఎపిసోడ్ వేడి పుట్టించింది..

    మొదటి ఎపిసోడ్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం తో రెండవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేసారు..రెండవ ఎపిసోడ్ లో భీమ్లా నాయక్ నిర్మాత సూర్య దేవర నాగ వంశి తో పాటుగా DJ టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ మరియు మరో హీరో విశ్వక్ సేన్ లు కూడా హాజరయ్యారు.

    ఈ ప్రోమో మధ్యలో బాలయ్య బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఫోన్ చేస్తాడు..త్రివిక్రమ్ తో మాట్లాడుతూ ‘ ఎం త్రివిక్రమ్..నా ప్రోగ్రాం కి ఎప్పుడు వస్తున్నావ్’ అని అడుగుతాడు..అప్పుడు త్రివిక్రమ్ ‘మీరు ఇప్పుడు రమ్మన్నా వచ్చేస్తాను సార్’ అని అంటాడు..అప్పుడు బాలకృష్ణ మాట్లాడుతూ ‘ ఎవరితో కలిసి రావాలో తెలుసుగా’ అని అంటాడు..అంటే త్రివిక్రమ్ కి పవన్ కళ్యాణ్ సోల్ మేట్ లాంటోడు అనే విషయం మన అందరికి తెలిసిందే..ఎవరైనా ఇద్దరు స్నేహితులు ప్రాణంగా ఒకరికోసం ఒకరు ఉంటె వాళ్ళని పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ స్నేహం తో పోలుస్తారు..అంత గొప్పది వీరి స్నేహం.

    బాలయ్య బాబు ఎవరితో రావాలో తెలుసుగా అంటూ త్రివిక్రమ్ తో ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడే అర్థం అయిపోయింది..అది పవన్ కళ్యాణ్ తో అని.. చాలా కాలం నుండి మీడియా లో ‘అన్ స్టాపబుల్ విత్ NBK 2’ చివరి ఎపిసోడ్ కి పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ అతిధులుగా రాబోతున్నారు అనే వార్త ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈరోజు వచ్చిన రెండవ ఎపిసోడ్ ప్రోమో తో ఈ విషయం ఖరారు అయిపోయింది..ఎప్పటి నుండో పవన్ కళ్యాణ్ – బాలయ్య బాబు ని కలిపి ఒకే ఫ్రేమ్ లో చూడాలి అని ఆశపడుతున్న అభిమానుల కోరిక మొత్తానికి నెరవేరబోతోంది అనే చెప్పాలి.