https://oktelugu.com/

Unstoppable With NBK – Prabhas : ‘ఈ సంక్రాంతికి నా సినిమానే చూడు..మీ నాన్నది కాదు’ రామ్ చరణ్ కి బాలయ్య ఫోన్ కాల్..వైరల్ వీడియో

Unstoppable With NBK – Prabhas: ప్రేక్షకులను చాలా రోజుల నుండి ఊరిస్తూ వచ్చిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ప్రభాస్ ఎపిసోడ్ ఎల్లుండి ఆహా మీడియా లో స్ట్రీమింగ్ కాబోతుంది..ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నారు..ఆ అభిమానుల ఎదురు చూపులకు తగ్గట్టుగానే ఆహా మీడియా వారు ప్రభాస్ ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారు..ఈ ఎపిసోడ్ కేవలం ఒక్క ఎపిసోడ్ మాత్రమే అని ముందు నుండి ప్రచారం […]

Written By:
  • NARESH
  • , Updated On : December 28, 2022 / 09:28 PM IST
    Follow us on

    Unstoppable With NBK – Prabhas: ప్రేక్షకులను చాలా రోజుల నుండి ఊరిస్తూ వచ్చిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ప్రభాస్ ఎపిసోడ్ ఎల్లుండి ఆహా మీడియా లో స్ట్రీమింగ్ కాబోతుంది..ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నారు..ఆ అభిమానుల ఎదురు చూపులకు తగ్గట్టుగానే ఆహా మీడియా వారు ప్రభాస్ ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారు..ఈ ఎపిసోడ్ కేవలం ఒక్క ఎపిసోడ్ మాత్రమే అని ముందు నుండి ప్రచారం జరుగుతూ వచ్చింది.

    కానీ అభిమానులను పూర్తి స్థాయి లో సంతృప్తి పరిచేందుకు ఆహా మీడియా రెండు పార్టులుగా ఈ ఎపిసోడ్ ని విభజించారు..మొదటి పార్ట్ ఈ నెల 30 వ తారీఖున టెలికాస్ట్ కాబోతుండగా..రెండవ పార్ట్ జనవరి ఆరవ తేదీన స్ట్రీమింగ్ చెయ్యబోతున్నారు..ఈ రెండు పార్ట్స్ మొత్తం ఫుల్ ఫన్ తో నిండిపోయింది..ఇక ఎల్లుండే మొదటి పార్ట్ టెలికాస్ట్ అవ్వబోతున్నందున రెండవ ప్రోమో ని విడుదల చేసారు.

    ఈ ప్రోమో లో ముందుగా బాలయ్య బాబు ప్రభాస్ తో మాట్లాడుతూ ‘అందరిని డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తావు..నీ పిలుపుకే అందరూ పడిపోతారు..వారిలో నేను కూడా ఉన్నాను’ అని అంటాడు..ఇక ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ రామ్ చరణ్ కి ఫోన్ చేస్తాడు అనే విషయం మొదటి ప్రోమోలోనే మనకి తెలుసు..రెండవ ప్రోమో లో కూడా రామ్ చరణ్ తో ఫోన్ కాల్ గురించి ఒక చిన్న బిట్ ఉంటుంది.

    ఈ బిట్ లో బాలయ్య చరణ్ తో మాట్లాడుతూ ‘ఈ సంక్రాంతి కి ముందు నా సినిమానే చూడు..మీ నాన్న సినిమా తర్వాత చూడు’ అని అంటాడు..చూడడానికి ఎంతో సరదాగా అనిపించింది అభిమానులకు ఈ బిట్ ని చూస్తే..ఆ వీడియో ని మీరు కూడా క్రింద చూసేయండి..ఇలాంటి ఫన్ ఎంటర్టైన్మెంట్ తో నిండి పోయిన ఈ ఎపిసోడ్ కోసం ఎల్లుండి వరకు వేచి చూడాలా అని అనిపించక తప్పదు.