Unstoppable Pawan Kalyan Episode: ఆహా మీడియా లో ప్రసారమయ్యే ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే..సీజన్ 1 ఎంత హిట్ అయ్యిందో, సీజన్ 2 అంతకు మించి హిట్ అయ్యింది..నిన్న మొన్నటి వరకు ప్రభాస్ ఎపిసోడ్ కోసం అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూసారు..ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కోసం అంతకు మించి ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.

డిసెంబర్ 27 వ తారీఖున ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసారు..సంక్రాంతి కానుకగా ఆ ఎపిసోడ్ ని స్ట్రీమింగ్ చేస్తారని సోషల్ మీడియా లో బలమైన టాక్ వినిపించింది..కానీ ఇప్పుడు ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఒక వార్త పవన్ కళ్యాణ్ అభిమానులను నిరాశపరుస్తుంది..సంక్రాంతి రోజున ఈ ఎపిసోడ్ రావట్లేదట..ఫిబ్రవరి నెలలోనే టెలికాస్ట్ చేసే ఆలోచనలో ఉందట ఆహా మీడియా టీం.
జనవరి నెల మొత్తం ప్రభాస్ ఎపిసోడ్ ని బాగా ప్రమోట్ చేసి, ఫిబ్రవరి లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని టెలికాస్ట్ చెయ్యాలని చూస్తున్నారట..ప్రభాస్ ఎపిసోడ్ పార్ట్ 1 కి రెస్పాన్స్ అదిరిపోయింది..ఇప్పుడు పార్ట్ 2 ని జనవరి 6 వ తేదీన స్ట్రీమింగ్ చెయ్యబోతున్నారు..ఈ ఎపిసోడ్ తర్వాత మరో ఇద్దరి సెలబ్రిటీస్ తో ఉంటుందట..తర్వాతే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమ్ చేస్తారట.

పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తోనే రెండవ సీజన్ కి ముగింపు పడనుంది..నేటి తరం స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ప్రభాస్ మరియు అల్లు అర్జున్ వంటి వారితో రెండు సీజన్స్ లో ఎపిసోడ్స్ చేసారు..ఇక స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ మిగలగా, బాలయ్య తరం హీరోలలో చిరంజీవి , నాగార్జున మరియు వెంకటేష్ మిగిలి ఉన్నారు..వీళ్ళతో సీజన్ 3 ప్లాన్ చెయ్యడానికి చూస్తున్నాడు అల్లు అరవింద్.