Unstoppable With NBK Prabhas: ఆహాకు అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కాసులు కురిపిస్తుంది. బాలయ్య సారథ్యంలో ఇండియాలోనే అతిపెద్ద టాక్ షోగా అన్ స్టాపబుల్ అవతరించింది. బాలయ్య హోస్టింగ్ షోకి బాగా ప్లస్ అయ్యింది. ఇతర టాక్ షోలకు భిన్నంగా రూపొందించడం జనాలను ఆకర్షిస్తుంది. టాప్ సెలబ్రిటీలను గెస్ట్స్ గా తీసుకొస్తున్న బాలయ్య వారి జీవితాల్లోని కాంట్రవర్సీ, రూమర్స్ ని తెరపైకి తేవడం ఆసక్తిరేపుతోంది. ఆడియన్స్ షో కోసం ఎదురు చూసేలా చేస్తుంది. కాగా న్యూ ఇయర్ కానుకగా ప్రభాస్ ని రంగంలోకి దింపారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై అన్ స్టాపబుల్ షో రెండు ఎపిసోడ్స్ గా ప్లాన్ చేశారు.

మొదటి ఎపిసోడ్ డిసెంబర్ 29న విడుదల చేశారు. రాత్రి 9 గంటలకు ప్రభాస్ ఎపిసోడ్ అని ప్రకటించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆడియన్స్ పోటెత్తారు. లక్షల మంది ఆహా యాప్ లో లాగిన్ కావడంతో దెబ్బకు క్రాష్ అయ్యింది. అంత ట్రాఫిక్ ని తట్టుకునే సామర్థ్యం లేక యాప్ పని చేయడం ఆగిపోయింది. మేనేజ్మెంట్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. సాంకేతిక లోపాలు తలెత్తాయి, టీం సరి చేస్తుందని చెప్పుకొచ్చారు.
ప్రభాస్ ఎపిసోడ్ చూడాలని ఎంతో ఆశ పడ్డ ఆడియన్స్ కి నిరాశే మిగిలింది. ఎప్పుడో అర్ధరాత్రి తర్వాత సమస్య తీరింది. దాంతో చాలా మంది ఆడియన్స్ పడుకున్నారు. ఒక భారీ రికార్డు సెట్ చేసే ఛాన్స్ ఆహా కోల్పోయింది. ఆదాయం కూడా కొంత మేర దెబ్బతింది. అయినప్పటికీ ప్రభాస్ ఎపిసోడ్ ప్రభంజనం ఆగలేదు. ఈ ఎపిసోడ్ కొత్త రికార్డ్స్ సెట్ చేసింది. కేవలం 12 గంటల్లో 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు చేసింది. ఇది ఓటీటీ రంగంలో సరికొత్త చరిత్ర అని చెప్పొచ్చు.

ప్రోమోల్లో ప్రభాస్ పెళ్లి, ప్రేమ వ్యవహారాలు చర్చించినట్లు చూపించారు. ప్రభాస్ ఎందుకు వివాహం చేసుకోవడం లేదు? ఆయన ఎవరినైనా ప్రేమించారా? వంటి విషయాలు తెలుసుకోవాలనే ఆత్రుత జనాల్లో ఎప్పటి నుండో ఉంది. అన్ స్టాపబుల్ వేదికగా ఈ ప్రశ్నలకు ప్రభాస్ సమాధానం చెబుతారని అందరూ భావించారు. అందులోనూ బహు సిగ్గరి అయిన ప్రభాస్ ఎలాంటి ఇంటర్వ్యూలలో పాల్గొనరు. తన సినిమాల విడుదల సమయంలో మాత్రమే మీడియా ముందుకు వస్తారు. ఈ క్రమంలో బాలయ్య-ప్రభాస్ ల ఎపిసోడ్ పై ఎక్కడ లేని క్రేజ్ ఏర్పడింది.