
Janhvi Kapoor- Krithi Shetty: #RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ తో చెయ్యబోతున్న సినిమా షూటింగ్ రేపటి నుండి ప్రారంభం కాబోతుంది. ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఇంత తొందరగా రెగ్యులర్ షూటింగ్ ని కూడా ప్రారంభించుకోబోతుందని ఫ్యాన్స్ కూడా ఊహించలేకపోయారు. గత రెండు మూడు రోజుల నుండి అన్నపూర్ణ స్టూడియోస్ లో హాలీవుడ్ టెక్నిషియన్స్ తో కలిసి కొరటాల శివ ఒక ‘కార్గో షిప్’ సెట్ ని వేయించాడు.
ఇందుకోసం ఆయన భారీ గానే ఖర్చు చేసినట్టు సమాచారం.క్లైమాక్స్ కి ముందు వచ్చే ఈ సన్నివేశం సినిమాకే హైలైట్ గా నిలవబోతుందట.ఈ చిత్రం లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, సౌత్ ఇండియన్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
అయితే ఇన్ని రోజులు ఈ సినిమాలో జాన్వీ కపూర్ మెయిన్ హీరోయిన్ అని అందరూ అనుకున్నారు. కానీ ఆమెతో పాటుగా మరో హీరోయిన్ కూడా ఇందులో నటించేందుకు స్కోప్ బాగా ఉందట. ఒక్క మాటలో చెప్పాలంటే జాన్వీ కపూర్ కంటే ఎక్కువ నిడివి ఉన్న పాత్ర ఇది.దీనితో శ్రీదేవి కూతురికి టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే సెకండ్ హీరోయిన్ రోల్ ఇచ్చారా అని అభిమానులు సోషల్ మీడియా లో ఆందోళన చెందుతున్నారు.

అయితే జాన్వీ కపూర్ పాత్ర తక్కువ నిడివి ఉన్నప్పటికీ ఆమెనే మెయిన్ హీరోయిన్ గా ఉంటుందని, సినిమాలో ఒక కీలక పాత్ర కోసం ఈమధ్యనే కృతి శెట్టి (ఉప్పెన ఫేమ్) ని మూవీ టీం సంప్రదించింది అని, ఆమె పాత్ర మెయిన్ హీరోయిన్ మాత్రం కాదని చెప్పడం తో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కథ రీత్యా ఈ సినిమాలో మరికొంతమంది నటీనటులను కూడా సంప్రదించబోతున్నారని టాక్.