Umair Sandhu Tweet: ఆర్ఆర్ఆర్.. ఈ పేరువినగానే సినీ ప్రేక్షకుల్లో ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. కరోనా పరిస్థితులు ఏర్పడకుంటే ఈ టైంలో ఆర్ఆర్ఆర్ హవా కొనసాగేది. విడుదలకు దాదాపుగా అన్ని ఏర్పాట్లు చేసుకున్న చిత్రయూనిట్‌కు కరోనా షాక్ ఇచ్చింది. ప్రస్తుతం కరోనా కేసులు పెరగడం, ఒమిక్రాన్ వ్యాప్తి వల్ల మూవీ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకుంది చిత్ర యూనిట్. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన సైతం విడుదల చేసింది.
ఇదిలా ఉండగా.. ఈ మూవీని దుబాయ్ సెన్సార్ మెంబర్ ఉమైర్ సంధు చూశాడు. ఈ మూవీపై ఆయన చేసిన ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దీంతో పాటు మూవీపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీని చూశానని, అందులో ఒక్క కట్ సైతం చెప్పాల్సిన పని లేదని తెలిపాడు. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ నేషనల్ అవార్డు రావాల్సిందేనంటూ చెప్పుకొచ్చాడు. ఆయనకు ఈ మూవీ గేమ్ చేంజర్ అవుతుందన్నాడు.
Also Read: తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా ఎందుకు రాణించలేక పోతున్నారు ?
ఇక రామ్ చరణ్ గురించి మరింత ఎక్కువగా వివరించాడు. ఈ మూవీకి రామ్ చరణ్ ఆత్మ వంటివాడని చెప్పుకొచ్చాడు. పాత్రలో ఆయన జీవించేశాడని పేర్కొన్నాడు. ఆయన స్టైలిష్ పర్ఫార్మెన్న్ చూస్తే ఫ్యాన్స్‌కు పిచ్చెక్కడం ఖాయమన్నాడు. సంధు ట్విట్టర్ లో చేసిన ఈ కామెంట్స్‌తో మూవీపై అంచనాలు మరింతగా పెరిగాయనే చెప్పాలి. మరి ఈ మూవీ రిలీజ్ అయితే ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. కానీ ఈ మూవీ రిలీజ్ తేదిని చిత్ర బృందం ఇంకా ప్రకటించలేదు.
మరి సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేదంటే మరింత టైం పడుతుందా అనే విషయంపై క్లారిటీ రాలేదు. కానీ ఒక వేళ మూవీ ఇప్పటికే రిలీజ్ అయి ఉంటే ఎన్ని రికార్డులు బ్రేక్ చేసేదోనని ఫ్యాన్ అంటున్నారు. మూవీని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఈ మూవీకి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. ట్రైలర్ సైతం ఎన్నో రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే.
Also Read: ఆర్‌ఆర్‌ఆర్ రిలీజ్ ఆపాలంటున్న అల్లూరి వారసురాలు… కారణం అదేనా ?