Syphilis Outbreak In Europe: యూరప్‌లోని పోర్న్‌స్టార్స్‌ను సిఫిలిస్ వ్యాధి భయం వెంటాడుతోంది. లైంగిక వ్యాధి అయిన సిఫిలిస్ శృంగారం ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ఇది సోకిన వారి శరీరంపై గాయాలవుతాయి. దద్దుర్లు వస్తాయి. యాంటీబయాటిక్స్‌తో దీనిని నయం చేసే వీలుంది. అయితే నిర్లక్ష్యం చేస్తే మాత్రం పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంటే.. అంతర్గత అవయవాలు పాడవడం, మెదడు పనితీరు దెబ్బతినడం వంటివి జరుగుతాయి. కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే అశ్రద్ధ చేయకుండా చికిత్స తీసుకోవాలి.

పోర్న్ స్టార్స్‌కు కష్టాలు..
సిఫిలిస్ వ్యాధికి సంబంధించిన ఆందోళనల నేపథ్యంలో యూకేలోని పోర్న్ స్టార్లు షూటింగులకు హాజరుకావడం మానేశారు. ప్రొడ్యూసర్లు షూటింగులు నిలిపివేశారు. దీనివల్ల పెద్ద నటులు ఆదాయం కోల్పోతున్నట్టు మాజీ పోర్న్‌స్టార్ లియానే యంగ్ ఆవేదన వ్యక్తం చేశారు. సిఫిలిస్ ప్రబలుతున్న నేపథ్యంలో యూరప్‌లో హెచ్చరిక జారీ అయినట్టు పేర్కొంది. సిఫిలిస్ వ్యాధి ఆందోళనల నేపథ్యంలో షూటింగులు మానేసిన పోర్న్ స్టార్లు తమకోసం ఓ యూనియన్ ఉండాలని కోరుకుంటున్నారు. కాగా, సిఫిలిస్ చాపకింద నీరులా ప్రబలుతున్న విషయాన్ని యూరప్‌లోని పోర్న్ స్టార్లకు తెలియజేసినట్టు యూఎస్ అడల్ట్ యాక్టర్ల కోసం లైంగిక ఆరోగ్య ధ్రువీకరణ పత్రాల డేటా బేస్‌ను నడుపుతున్న ‘పాస్’ వెల్లడించింది. అమెరికా అడల్ట్ స్టార్లతోపాటు పలువురిలో సిఫిలిస్‌ను గుర్తించినట్టు ఇది పేర్కొంది.
సిఫిలిస్ అంటే ఏమిటి?
సిఫిలిస్ అనేది అంటువ్యాధి. ఇది ప్రధానంగా లైంగిక మార్గం ద్వారా వ్యాపిస్తుంది. కొన్నిసార్లు, ఇది దగ్గరి శారీరక సంబంధం ద్వారా కూడా వ్యాపించవచ్చు. ఇది చాలా కాలం వరకు ఒక వ్యక్తిలో అంతర్లీనంగా (పైకి లక్షణాలు ఏమి చూపకుండా) ఉండవచ్చు. అటువంటి వ్యక్తులు సంక్రమణ వాహకాలుగా ఉంటారు. సిఫిలిస్ బ్యాక్టీరియా వలన సంభవిస్తుంది.
ప్రధాన సంకేతాలు.. లక్షణాలు..
సిఫిలిస్ అనేది మూడు విభిన్న దశలలో, ప్రతి దశకు ప్రత్యేక లక్షణాలు ఉంటాయి.
ప్రాథమిక దశ..
ఇది ప్రారంభ దశ బాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన 3 నెలల వరకు కొనసాగుతుంది. ఏ ఇతర ప్రధాన లక్షణాలు లేకుండా వ్యక్తికి శరీరం మీద చిన్నచిన్న నొప్పి లేని పుండ్లు ఏర్పడతాయి. ప్రాథమిక సిఫిలిస్ ఏ వైద్యం లేకుండానే కొన్ని వారాలలో తగ్గిపోతుంది.
ద్వితీయ దశ..
చేతులు, కాళ్లు మరియు జననేంద్రియ ప్రాంతాల్లో దద్దుర్లుకు లక్షణాలు పురోగతి చెందుతాయి. ఇన్ఫెక్షన్/సంక్రమణ సోకిన సుమారు 6 నెలల పాటు ఈ దశ కొనసాగుతుంది. సంక్రమిత వ్యక్తిలో జ్వరం, తలనొప్పి మరియు జననేంద్రియ ప్రాంతాల్లో అసాధారణ పెరుగుదలలు ఏర్పడవచ్చు.
మూడో దశ..
ఇది ప్రధాన అవయవాలు ప్రభావితమయ్యే చివరి దశ.
ప్రధానంగా ఈ దశలో అంధత్వం, పక్షవాతం మరియు గుండెసంబంధిత సమస్యలు సంభవిస్తాయి. చికిత్స చేయకపోతే, ఇది ప్రాణాంతకం కావచ్చు.
వ్యాధికి ప్రధాన కారణాలు..
సిఫిలిస్‌కు కారణమయ్యే బాక్టీరియా పేరు ట్రెపోనోమా పాల్లిడియం అసురక్షిత లైంగిక సంబంధాలు కలిగి ఉండడం ఈ సంక్రమణ వ్యాప్తి యొక్క అత్యంత సాధారణ మార్గం. స్వలింగ సంపర్క పురుషులలో సిఫిలిస్ అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సంక్రమిత స్త్రీ నుంచి తనకు పుట్టే బిడ్డకు కూడా సంక్రమించగలదు. దానిని పుట్టుకతో వచ్చే సిఫిలిస్ అని అంటారు. సంక్రమిత వ్యక్తి బయటకి ఉండే దద్దుర్లు లేదా పుండుని తాకినా కూడా సంక్రమణను వ్యాపించవచ్చు.

నిర్ధారణ ఇలా..
పరీక్షలు నిర్వహించే ముందు, వైద్యులు రోగి యొక్క లైంగిక చరిత్రను తీలుసుకుంటారు. చర్మం, ముఖ్యంగా జననేంద్రియ ప్రాంతాలను పరిశీలిస్తారు.
లక్షణాలు, పరిశీలన ఫలితాలు సిఫిలిస్ అనుమానాన్ని కలిగిస్తే, రక్త పరీక్ష నిర్వహిస్తారు. అలాగే, సిఫిలిస్ బాక్టీరియా కోసం తనిఖీ పుండు యొక్క పరీక్ష కూడా చేస్తారు. మూడో దశగా అనుమానించబడితే, అంతర్గత అవయవాల స్థితిని పరీక్షించడానికి పరీక్షలు నిర్వహిస్తారు. సంక్రమణలో నాడీ వ్యవస్థ ప్రమేయాన్ని గుర్తించడానికి వెన్నుముక నుంచి ద్రవాన్ని సేకరించి, బ్యాక్టీరియా కోసం పరీక్షిస్తారు. సిఫిలిస్ ధ్రువీకరించబడితే, రోగి భాగస్వామికి కూడా పరీక్షలు నిర్వహించాలని సలహా ఇస్తారు.
సిఫిలిస్ చికిత్స ఇలా..
ప్రారంభ దశ సిఫిలిస్ కోసం యాంటీబయాటిక్స్ సూచించబడతాయి, సాధారణంగా అవి ఇంజెక్టబుల్ (సూది మందు ద్వారా ఇచ్చే) యాంటీబయాటిక్స్. సిఫిలిస్ చికిత్స కోసం పెన్సిలిన్ సాధారణంగా ఉపయోగించే యాంటీబయోటిక్. మూడో దశ సిఫిలిస్ కోసం, విస్త్తృతమైన చికిత్స అవసరం అవుతుంది. ఈ దశలో జీవి పూర్తిగా తొలగించబడదు కాబట్టి ప్రధానంగా లక్షణాలను మెరుగుపరచడానికి చికిత్స అవసరం. చికిత్స వ్యవధిలో లైంగిక కార్యకలాపాలకు లేదా దగ్గరి భౌతిక సంబంధాలకు దూరంగా ఉండాలి.
Also Read:Pawan Kalyan- Godfather Trailer: గాడ్ ఫాదర్ సినిమా ట్రైలర్ చూసిన పవన్ కల్యాణ్ ఏమన్నాడో తెలుసా?
[…] Also Read: Syphilis Outbreak In Europe: యూరప్‌లో సిఫిలిస్ విజృంభ… […]