
Jasprit Bumrah- Rishabh Pant: ఒకరిదేమో నిర్లక్ష్యం.. మరొకరిది ఏమో గాయం.. మొత్తానికి ఇద్దరు దిగ్గజ ప్లేయర్లు టీమిండియాకు దూరం అయ్యారు. వారి లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియతో సిరీస్ లో పంత్ లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది. భరత్ కీపింగ్ లో అదరగొట్టినా.. బ్యాటింగ్ లో పంత్ లా ప్రభావం చూపించడం లేదు. ఇక బౌలింగ్ లో షమీ, సిరాజ్ ఫర్వాలేదనిపిస్తున్నా మన ఇండియన్ పిచ్ లు కానీ చోట వీరిద్దరి రాణింపు కష్టమే. విదేశీ పిచ్ లపై బుమ్రా లాంటి నాణ్యమైన బౌలర్ అవసరం. అయితే వీరిద్దరి రీఎంట్రీ ఇప్పట్లో లేదు. పంత్ కు కనీసం రెండేళ్లు పడుతుందట.. ఇక బుమ్రా ఆరు నెలల వరకూ అందుబాటులోకి రావడం కష్టమేనట.. కనీసం వచ్చే వన్డే ప్రపంచకప్ వరకైనా బుమ్రా రావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. పంత్, బుమ్రా లేకపోవడం ఖచ్చితంగా టీమిండియాకు భారీ లోటు అని చెప్పొచ్చు.*
– కోలుకుంటున్న పంత్..
గత డిసెంబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. వాకింగ్ స్టిక్స్ సహాయంతో నడుస్తోన్న ఫొటోను ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అతడి కుడి కాలికి బ్యాండేజ్ కనిపిస్తోంది. పంత్ త్వరగా కోలుకోవాలంటూ క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రోడ్డు ప్రమాదం కారణంగా ఐపీఎల్‌తోపాటు వన్డే వరల్డ్ కప్‌కు పంత్ దూరం కానున్నాడు.
జట్టులో చేరడానికి రెండేళ్లు..
ప్రస్తుతం పంత్ పరిస్థితి చూస్తే ఆయన గాయాలు పూర్తిగా మానడానికి ఇంకో ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. తర్వాత ప్రాక్టీస్ ప్రారంభించి ఎలాటి సమస్య తలెత్తకుండా ఉంటే ఫిట్ నెస్ నిరూపించుకోవాలి. అందుకు మరో ఆరు నెలలు పట్టవచ్చు. ఏదైనా సమస్య తలెత్తితే మళ్లీ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చూసినా రిషబ్ తిరిగి జట్టులో చేరడానికి ఇంకో 12 నుంచి 16 నెలలు పట్టే అవకాశం ఉంది.

కోలుకొని బూమ్రా..
వెన్ను నొప్పి కారణంగా చాలా రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పునరాగమనం మరింత ఆలస్యమయ్యే అవకాశమే ఎక్కువ ఉంది. బూమ్రా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లోనే బౌలింగ్ చేశాడు. వెన్నునొప్పి తిరగబెట్టడంతో మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు జట్టుతో చేరతాడని వార్తలు వచ్చాయి. కానీ అది జరగలేదు. పునరాగమనంపై బీసీసీఐ కూడా తొందర వద్దన్న ఆలోచనలోనే ఉంది.
ఆసీస్ సిరీస్ మొత్తానికి దూరం..
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో భారత జట్టు వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌తో బుమ్రా పునరాగమనం చేస్తాడని కూడా వార్తలు వినిపించాయి. కానీ ఈ సిరీస్‌కు సెలక్టర్లు బూమ్రాను ఎంపిక చేయలేదు. అతనికి విశ్రాంతి ఇవ్వడమే మేలని భావించారు.
ఐపీఎల్ కూ అనుమానమే..
తాజా సమాచారం మేరకు అతను ఐపీఎల్ కూడా ఆడటం కష్టమే అని తెలుస్తోంది. ఇంకా గట్టిగా మాట్లాడితే జూన్‌లో జరిగే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో కూడా బుమ్రా ఆడటం అనుమానమే అంటున్నారు. అతను ఐపీఎల్ ఆడకపోతే ముంబై ఇండియన్స్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. పరిస్థితి చూస్తే బూమ్ర వన్డే వరల్డ్ కప్ వరకు వచ్చే అవకాశం లేదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.