Jogipet Medak District: కలియుగంలో ఎన్నో వింతలు చూస్తున్నాం. అంత బ్రహ్మంగారు చెప్పినట్లే జరుుతోందని చెబుతున్నాం. ఈ నేపథ్యంలో ఇలాంటి ఓ వింత ఘటనే చోటుచేసుకోవడం గమనార్హం. మగాడు మగాడిని పెళ్లి చేసుకోవడం వాడు కాపురానికి రావడం అంతా విచిత్రంగా సాగింది. అచ్చం సినిమా కథలా సాగిన ఇందులో ఇద్దరు యువకుల ప్రవర్తనే అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తాగిన మైకంలో ఓ యువకుడు మరో యువకుడి మెడలో తాళి కట్టడంతో అతడు తాళి కట్టిన వాడి ఇంటి ఎదుట కాపురం చేస్తానని చెప్పి ఆందోళన చేయడం విచిత్రమే.

సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన ఓ యువకుడు కల్లు తాగేందుకు కొల్పారం మండలంలోని దుంపలకుంట గ్రామానికి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో అతడికి మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం చండూర్ కు చెందిన ఆటో డ్రైవర్ తో పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరు కలుసుకుని కల్లు తాగుతూ కాలక్షేపం చేసేవారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 1న ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఆటో డ్రైవర్ మరో యువకుడికి తాళి కట్టాడు.
Also Read: K.G.F: Chapter 2: ‘కేజీఎఫ్ 2’ నుంచి ఎదగరా ఎదగరా.. క్షణాల్లోనే సంచలనాలు
దీంతో అతడే నా భర్త అని కాపురం చేస్తానని సదరు యువకుడు ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్లి ఆందోళన చేశారు. దీంతో విషయం పోలీసులవరకు వెళ్లింది. వారు సర్దిచెప్పినా వినడం లేదు. తనకు రూ. లక్ష కావాలని డిమాండ్ చేశాడు. చివరకు వారంతా కలిసి రూ. 10 వేలు ఇప్పించేందుకు ఒప్పందం చేయడంతో ఆందోళన విరమించాడు. విచిత్ర సన్నివేశం చూసి అందరు ఆశ్చర్యపోయారు.

కలికాలంలో వింతలు ఇలాగే ఉంటాయా? ఒక మగాడు మరో మగాడికి తాళి కట్టడం ఏమిటి? అతడు కాపురం చేస్తానని రావడం ఏమిటి? అనే ఆందోళన అందరిలో ఆలోచనలు రేపింది. తాగిన మైకంలో ఆడిన ఓ వింత డ్రామాగా కనిపించడం తెలిసిందే. మొత్తానికి పోలీసులు, గ్రామస్తులు సైతం నివ్వెర పోయారు. జాతిరత్నాలు కలిసి కాపురం చేస్తారా? అనే సందేహాలు అందరిలో వచ్చాయి. కథ సుఖాంతం కావడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read:Victory Venkatesh: ‘వెబ్ సిరీస్ – ద్విభాషా చిత్రం’ మధ్యలో వెంకటేష్
[…] Illegal Affair: అక్రమ సంబంధాలు సక్రమమైనవి కావని తెలిసినా మానలేరు. వాటి వెంటే పరుగులుపెడుతున్నారు. ఫలితంగా ప్రాణాలు కోల్పోతున్నారు. నిండు జీవితాలను మధ్యలోనే ముగిస్తున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో మరో హత్య జరిగింది. నిండు నూరేళ్లు బతకాల్సిన యువవకుడిని గొంతు కోశారు. చివరకు నిందితులు కటకటాలపాలయ్యారు. క్షణికావేశంలో హత్య చేసి జీవితాంతం జైల్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనిషి కుదురుగా ఉండలేకే ఇలాంటి వాటిలో చిక్కుకుని తమ భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారు. […]