Hyderabad: కాలం మారుతోంది. సాంకేతికత మనిషి జీవితంలో కొత్త మార్పులు తీసుకొస్తోంది. ఇదే సమయంలో మనిషిలో విచక్షణా అనేది కరువవుతోంది. దీనికి తోడు సామాజిక మాధ్యమాలు జీవితాల్లోకి చొచ్చుకు రావడంతో ఒక మనిషి మరొక మనిషితో మాట్లాడుకోవడం అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఎంతసేపూ సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలడం పరిపాటిగా మారింది. ఇదే క్రమంలో కొత్త కొత్త స్నేహాలు పురుడు పోసుకుంటున్నాయి. అవి అంతవరకు ఉంటే బాగానే ఉండు. అవి పరిధి దాటుతుండడంతో కొత్త కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ స్నేహాలు కాస్త వివాహేతర సంబంధాలుగా మారుతుండడంతో కుటుంబాలు కకావిక
లమవుతున్నాయి.
ఉపాధ్యాయురాలితో..
ఆ మధ్య మనం చెప్పుకున్నాం కదా! హైదరాబాద్ లోని కూకట్పల్లి ప్రాంతంలో ఓ ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయురాలు విద్యార్థితో ప్రేమలో పడిందని, ఆ తర్వాత అతనితో కలిసి పారిపోయిందని.. చివరికి పెళ్లి కావలసిన ఆ యువతికి తల్లిదండ్రులు నచ్చచెప్పి ఇంటికి తీసుకొచ్చారు. ఇక అమెరికా దేశంలో నలుగురు ఉపాధ్యాయినులు తాము పాఠాలు చెబుతున్న విద్యార్థులతో లేచిపోవడం ఆ దేశంలో కలకలం సృష్టించింది. ఇలా చెప్పుకుంటూ పోతే సామాజిక మాధ్యమాల విస్తృతి వల్ల జరుగుతున్న అనర్ధాలు ఎన్నో. అయితే ఇలాంటి సామాజిక మాధ్యమం ద్వారా ఉపాధ్యాయురాలికి యువకుడు పరిచయమయ్యాడు. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇది ఇంట్లో తెలవడంతో జరగరాని అనర్ధాలు జరిగిపోయాయి.
అంబర్ పేట ప్రాంతంలో.
హైదరాబాద్ మహానగరంలోని అంబర్పేట డాక్టర్స్ కాలనీలో రాజేష్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పైగా అతని శవం కుళ్ళిపోయిన స్థితిలో కనిపించింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. అతడి సెల్ఫోన్ కాల్ హిస్టరీ ఆధారంగా కీలక ఆధారాలు రాబట్టారు. అయితే వారు చెప్పిన వివరాలతో రాజేష్ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
ఉపాధ్యాయురాలితో పరిచయం
రాజేష్ సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్ గా ఉంటాడు. అయితే అతడికి హయత్ నగర్ ప్రాంతంలో పనిచేసే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య వయసులో చాలా తేడా ఉంది. అయినప్పటికీ ఇద్దరూ ప్రేమ మైకంలో పడిపోయారు. ఇక రాజేష్ అవసరాలకు సదరు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు డబ్బులు సర్దుబాటు చేసేది. ఇద్దరు కూడా అప్పుడప్పుడు శారీరకంగా కలుసుకునేవారు. అయితే ఆ దృశ్యాలను రాజేష్ తన ఫోన్లో బంధించేవాడు. అయితే ఈ విషయం ఆ ప్రభుత్వ ఉపాధ్యాయురాలి భర్తకు తెలిసింది. పలుమార్లు ఆమెను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె తన తీరు మార్చుకోలేదు. ఈ క్రమంలో భార్యాభర్తలకు మధ్య తీవ్రంగా గొడవలు అయ్యాయి. అయితే మనస్థాపం చెందిన ఆ ఉపాధ్యాయురాలు రాజేష్ కు ఫోన్ చేసింది. నేను చనిపోతున్నా అంటూ అతడికి ఏడ్చుకుంటూ చెప్పింది. దీంతో అతడు నువ్వు చనిపోతే నేను కూడా నీ వెంట వస్తాయని ఆమెతో అన్నాడు. అయితే తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఈనెల 24న ఆ ఉపాధ్యాయురాలు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెను చికిత్స నిమిత్తం చేర్పించారు.
ఉపాధ్యాయురాలు ఫోన్ చేయకపోవడంతో..
అయితే ఆనాటి నుంచి సదరు ఉపాధ్యాయురాలు ఫోన్ చేయకపోవడంతో రాజేష్ ఆమె ఇంటి చుట్టూ తిరుగుతుండేవాడు. ఈలోగా సదరు ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఆరోగ్యం విషమించి సోమవారం కన్నుమూసింది. అయితే దీనిని మనసులో పెట్టుకున్న నాగేశ్వరరావు, అతడి కొడుకు రాజేష్ పై దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆ దెబ్బలు తట్టుకోలేక అతడు మృతి చెందినట్లు భావిస్తున్నారు. అయితే ఈ కేసు తమ మీద రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని ఒక నిర్మానుష్య ప్రాంతంలో పడేసినట్టు పోలీసులు చెబుతున్నారు. కాగా రాజేష్ ఫోన్లో ఆ ఉపాధ్యాయురాలితో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు లభించడంతో పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. వాటిని చూసిన రాజేష్ కుటుంబ సభ్యులు కూడా షాక్ కు గురయ్యారు. అయితే ఉపాధ్యాయురాలితో వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నాగేశ్వరరావు, అతని కొడుకును అదుపులోకి తీసుకొని ప్రస్తుతం వారు ప్రశ్నిస్తున్నారు.