Ram Gopal Varma: ఎంత పెద్ద గుండ్రాయి కట్టినా కుక్క తోక వంకరగానే ఉంటుంది.. సహజంగానే దాని లక్షణం అంతే. తెలుగు నాట రాంగోపాల్ వర్మ అనే నెత్తి మాసిన దర్శకుడి బుద్ధి కూడా అలానే ఉంటుంది. అది పలుసార్లు నిరుపితమైంది కూడా.. హీరోయిన్ల కాలు నాకడం దగ్గరనుంచి… వారి చేతిలో చెంప దెబ్బలు తినేవరకు రామ్ గోపాల్ వర్మ తన అధమ వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు.

అయాన్ రాండ్ ప్రభావం
రామ్ గోపాల్ వర్మ మీద ఇంగ్లీషు రచయిత అయాన్ ర్యాండ్ ప్రభావం తీవ్రంగా ఉంది. అందుకే రాంగోపాల్ వర్మ ఈ బంధాలను కూడా అంత సీరియస్ గా తీసుకోడు. కన్న కూతురు పెళ్లి అయితే ఓ బంధువు లాగా వెళ్లి వచ్చాడు. భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత బాలీవుడ్ నటి ఊర్మిళతో చాలా సంవత్సరాలు సహజీవనం చేశాడు. తర్వాత ఆమెను వదిలించుకున్నాడు. ఇలా ఆయన జీవితంలో ఎంతో మంది మహిళలు వచ్చి వెళ్లారు. అంతేకానీ ఎవరితో కూడా సీరియస్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేదు. ఫోన్ తో కూడా సినిమా తీయగలిగే సత్తా ఉన్న రామ్ గోపాల్ వర్మ… ఏ విషయం మీద కూడా స్థిరమైన చిత్తాన్ని ప్రదర్శించకపోవడం గమనార్హం. ఇక తల్లి తో కలిసి వోడ్కా తాగడం, అంతటి కోవిడ్ టైం లో మియా మాల్కోవా తో కలిసి పోర్న్ సినిమా తీయటం రామ్ గోపాల్ వర్మ కే చెల్లింది. ఇక మీడియాను ఆ టెన్షన్ చేయడంలో రామ్ గోపాల్ వర్మ తర్వాతే ఎవరైనా.. జనాల్లో నానేందుకు ఏమైనా చేస్తాడు. ఎంతకైనా తెగిస్తాడు. ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే రామ్ గోపాల్ వర్మ.. వివాదాస్పద అంశాలను తరచూ గెలుక్కుంటాడు. తనకు నచ్చితే రాజకీయ పార్టీలకు తెర వెనుక సహాయం కూడా చేస్తాడు. 2019 ఎన్నికల్లో జగన్ పార్టీకి అనుకూలంగా “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే సినిమా కూడా తీశాడు.
తలతిక్క క్యారెక్టర్
రాంగోపాల్ వర్మ ఓ తలతిక్క క్యారెక్టర్.. తన ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తాడు. ఎంతకైనా తెగిస్తాడు. ఒకప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ తనవైపు చూసేలా సినిమాలు తీశాడు. శివ, రంగీలా, సర్కార్, క్షణక్షణం… ఇలా చెప్పుకుంటూ పోతే రాంగోపాల్ వర్మ మాస్టర్ పీస్ సినిమాలు ఎన్నో. కానీ కాలక్రమేణా అతడి మానసిక పరిస్థితులో మార్పు వచ్చింది.

మాట్లాడే మాటలో, తీసే సినిమాల్లో పూర్తి లయ తప్పింది.. ఫలితంగా వివాదాస్పదమైన వ్యక్తిగా మారిపోయాడు.. ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో అతడు చేస్తున్న చేష్టలు అత్యంత జుగుస్సాకరంగా మారాయి. తన కూతురు వయస్సు ఉన్న ఆషు రెడ్డి తో ఇటీవల నిర్వహించిన ఇంటర్వ్యూలో తన రోత ప్రదర్శనతో ఏవగింపు కలిగించాడు. ఆమె కాలు నాకుతూ చెండాలంగా ప్రవర్తించాడు. ఆమె కుర్చీలో కూర్చుంటే మాట తూలాడు. ఆమె తన చేతికి పని చెప్పి అతడి చెంప పగలగొట్టింది.. దీనిని మన నాటు భాషలో చెప్పాలంటే కుక్కకాటుకు చెప్పు దెబ్బ అనుకోవచ్చు.
