
BB Jodi Telugu: మొన్న మనం చెప్పుకున్నాం కదా స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ జోడి రియాల్టీ డ్యాన్స్ షో ఈటీవీ ఢీ ని కొట్టేసిందని.. అది ఇచ్చిన ఉత్సాహమో, డైరెక్టర్ల పైత్యమో తెలియదు కానీ.. ఇప్పుడు ఇది కూడా అడల్ట్ షో గానే మారుతున్నది. హద్దులు చెరిపేసి కంటెస్టెంట్లు రెచ్చిపోతున్నారు.. ముఖ్యంగా ఆ ముక్కు అవినాష్ వీర విహారం చేస్తున్నాడు.. కొన్ని కొన్ని సార్లు ఈటీవీ ఢీ షో చూస్తున్నామా అని అనుకునేలా చేస్తున్నాడు.. ముఖ్యంగా ఆ హగ్గులు, ముద్దులు, స్కిన్ షో బీ గ్రేడ్ సినిమాలను తలపిస్తున్నాయి.
కార్తీకదీపం తర్వాత ఆ స్థాయిలో రేటింగ్స్ వచ్చే సీరియల్స్, షో లు గాని మా టీవీ చేతిలో లేవు.. కాంతారా లాంటి సినిమాలు ప్రీమియర్ చేసినా అంతగనం రేటింగ్స్ రావడం లేదు..పైగా ఆ జీ తెలుగు రోజురోజుకు తన పాపులారిటీ పెంచుకుంటున్నది. నెట్ వర్క్ పరంగా చూసుకుంటే జీ తెలుగు భారీ స్థాయిలో ఉంది. ఇలాగే వదిలేస్తే తన నెంబర్ వన్ స్థానానికి బీటలు వారుతాయి అనే భయంతో ముందుగానే స్టార్ మా మేల్కొన్నది.. వెంటనే తన బిగ్ బాస్ కంటెస్టెంట్లను పిలిచింది.. ఎలాగూ శ్రీ ముఖి ఉండనే ఉన్నది. ఖాళీగా ఉన్న సదా, ఒకప్పటి డాన్స్ మాస్టర్ తరుణ్, ఆలనాటినటి రాధ తో మొత్తానికి ఒక సెట్ అప్ చేసింది.. కంటెస్టెంట్లు ఏదో చేశాం అనకుండా రోజు బీభత్సంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.. అది తెర పైన కనిపిస్తోంది.. దానికి ఫలితం దక్కనే దక్కింది. ఇన్నాళ్ళూ డాన్సర్ రియాల్టీ షోలో నెంబర్ వన్ పొజిషన్ అనుభవిస్తున్న ఢీ ని కొట్టేసింది.

ఇలాంటి ఫలితం వచ్చిన తర్వాత ఏ ఛానల్ అయినా మరింత నవ్యత కోసం, నాణ్యత కోసం పరుగులు తీస్తోంది.. కొత్త కంటెంట్ ను పెంచుతుంది.. ప్రేక్షకుల సంఖ్యను పెంచుకుంటుంది.. కానీ ఆ స్టార్ మా కంటెంట్ టీం, క్రియేటివిటీ టీం అచ్చం ఆ జబర్దస్త్ బృందం లాగే ఆలోచిస్తోంది.. ఇందులో భాగంగానే నేల బారు స్కిట్ లను చేయిస్తుంది.. దీనికి తోడు కంటెస్టెంట్ల ఓవరాక్షన్ తో చూసే ప్రేక్షకులకు విసుగు కలుగుతున్నది.. ముఖ్యంగా ముక్కు అవినాష్, శ్రీ సత్య లాంటి వారు ఏదో కరువు దేశం నుంచి వచ్చిన వాళ్ళ లాగా ప్రవర్తిస్తున్నారు.. దీనికి తోడు వాళ్ళ అతి ప్రవర్తన విసుగు కలిగిస్తోంది.. అసలే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పుంతలు తొక్కుతున్న కాలం.. ఎక్కడ ఏం దొరుకుతుందా అని భూతద్దాలతో చూసే నెటిజన్లు ఊరుకుంటారా… ఏకిపారేస్తున్నారు.
https://www.youtube.com/watch?v=gcdi7bi1iMI&t=246s