Youtube Views Fraud: చాలా తెలుగు సినిమాలు ట్రైలర్లలో చూపిస్తున్న స్పీడ్‌ను థియేటర్లలో చూపించలేకపోతున్నాయి. ప్రేక్షకులను మెప్పించలేక చతికిలపడుతున్నాయి. రెండే మూడు రోజులకే ఫెయిల్యూర్ టాక్‌తో డిజాస్టర్‌గా మిగిలిపోతున్నాయి. మెగా సినిమాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. తాజాగా విరాటపర్వం ప్రమోషన్లకు సంబంధించిం రెండు గంటలకోసారి ట్రెయిలర్‌కు వస్తున్న యూట్యూబ్ వ్యూస్ సంఖ్యను 4 మిలియన్లు, 5 మిలియన్లు, 6.5 మిలియన్లు అని చెప్పుకుంటున్నారు. నంబర్ వన్ ట్రెండింగ్ అని కూడా..! చివరకు దర్శకుడు వేణు కూడా నవ్వుకున్నాడట.
యూట్యూబ్ లెక్కలు ఓ ఫ్రాడ్..
అసలు యూట్యూబ్ వ్యూస్ అనేది ఓ పెద్ద దందా.. అది పాపులారిటీకి సరైన ఇండికేటర్ కాదు. విరాటపర్వం సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది.. కానీ దానికి సరైన సూచిక ఇది కాదు. ఆ వ్యూస్ కూడా సినిమా వసూళ్ల లెక్కలన్నీ ఫ్రాడ్.
అదెలా అంటే… ఇండస్ట్రీలో భీకరమైన జాతీయవాదిని, నిజాయితీవాదిని అని ఘనంగా చెప్పుకునే కంగనా రనౌత్ తీసిన థాకడ్ సినిమా ట్రెయిలర్ ఫస్ట్ రిలీజ్ తర్వాత 3.7 కోట్ల వ్యూస్.. సెకండ్ రిలీజ్‌కు 2.3 కోట్ల వ్యూస్.. చివరకు ఆ ట్రెయిలర్ రిలీజ్ చేయడానికి ఆమె హెలికాప్టర్‌లో వచ్చిన వీడియోకు కూడా 11 లక్షల వ్యూస్.. కంకనా వేసుకున్న డ్రెస్ మీద ఎవరో వీడియో చేస్తే దానికి కూడా 22 లక్షల వ్యూస్ వచ్చాయి.. కానీ..? తీరా సినిమా రిలీజ్ అయ్యాక రూ.90 కోట్లు పెట్టి తీసిని సినిమాకు రూ. 2, రూ.3 కోట్లు కూడా వాపస్ రాలేదు. బాలీవుడ్ చరిత్రలో ఇంతటి డిజాస్టర్ సినిమా మరొకటి లేదు. చివరకు ఈ దెబ్బకు ఈ సినిమా కొనడానికి ఏ శాటిలైట్ చానెల్, ఏ ఓటీటీ ముందుకు రాకపోవడం సినమా ఫెయిల్యూర్‌కు నిదర్శనం. థాకడ్ ప్రభావంతో తేజస్ సినిమా కొనడానికి బయ్యర్లు రావడం లేదు.. పోనీ, థియేటర్లను వదిలేసి ఓటీటీకి అమ్మేసి బయటపడాలని అనుకుంటే వాళ్లూ ముందుకు రావడం లేదు. నిర్మాతలు తలలుపట్టుకున్నారు.
Also Read: Way2News: రూ.130 కోట్లు సమీకరించిన వే2న్యూస్ యాప్..
తెలుగులో ఇటీవల విడుదలైన మెగా సినిమా ఆచార్య కూడా అంతే.. ట్రైలర్ రిలీజ్ తర్వాత యూట్యూబ్ వ్యూస్ భారీగా వచ్చాయి. చిరంజీని కూడా గతంలో ఏ సినిమాకు చేసుకోనంత ప్రమోషన్ ఆచార్యకు చేసుకున్నారు. తండ్రి, కొడుకు(చిరంజీవి, రామ్‌చరణ్) ఇద్దరూ కలిసి తొలిసారి నటించిన పూర్తిస్థాయి సినిమా ఇదే కావడంతో యూట్యూబర్లు బాగా ఇంట్రెస్ట్ చూపారు. దీంతో వ్యూస్ అనూహ్యంగా పెరిగాయి. మెగా సినిమా కాబట్టి సహజంగానే వ్యూస్, వ్యూవర్స్ ఉంటారు. ఆచార్య తండ్రి కొడుకుల సినిమా కావడంతో క్రేజీ మరింత పెరిగింది. ట్రయిలర్స్‌తోపాటు ప్రమోషన్స్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, కొరటాల శివ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపే ప్రయత్నం చేశారు. కానీ సినిమా మిడుదలయ్యాక మెగా డిజాస్టరగా మిగిలింది. చిరంజీవి సినిమాల్లో బిగ్గెస్ట్ ప్లాప్‌గా నిలిచిపోయింది.
ఇవి కేవలం ఉదాహరణ మాత్రమే.. చాలా సినిమాల పరిస్థితి ఇలాగే ఉంది. ట్రైలర్ వ్యూస్ ఆధారంగా సినిమాను అంచనా వేయడం కష్టం.. ఆకట్టుకునే చిన్నచిన్న సన్నివేశాలు రిలీజ్ చేసి.. వ్యూస్ లెక్కలు వేసుకుని.. సినిమాకు అంతకంటే ఎక్కువ మంది వస్తారని, చూస్తారని చెప్పుకుంటే అంతకంటే నవ్వుకునే విషయం ఏమీ ఉండదు. ఇక్కడ విషయం ఏమిటంటే.. కేవలం ట్రెయిలర్లకు యూట్యూబ్ వ్యూస్ అనే ఓ ఫేక్ దందా అక్కర్లేదు. టికెట్ల ధరలు తగ్గించాం అని నిర్మాత చెబుతున్నాడు కదా.. అలాంటి పాజిటివ్ పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పుకోవడమే బెటర్!!
Also Read:Bihar Couple: దారుణం: కుమారుడు శవం ఇచ్చేందుకు లంచం.. డబ్బుల్లేక బిచ్చమెత్తిన తండ్రి