https://oktelugu.com/

Instagram Top actors : విజయ్ దేవరకొండను అధిగమించిన అల్లు అర్జున్.. ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్-8 దక్షిణాది నటులు

Instagram Top actors సినీ ఇండస్ట్రీలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతో ముఖ్యం. ఎంత మంది ఫాలోవర్స్ ఉంటే అంత క్రేజ్. ఈ సోషల్ మీడియాలో అకౌంట్స్ ద్వారా సినీ స్టార్స్ సినిమా ప్రకటనలు చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటారు. చిత్రాలను ప్రమోట్ చేసుకుంటారు. కొత్త చిత్రాలను పంచుకుంటారు. పెద్ద బ్రాండ్ డీల్‌లను దీనిద్వారానే ప్రమోట్ చేసి డబ్బులు సంపాదిస్తారు. అందుకే సోషల్ మీడియా ప్రముఖుల జీవితంలో కీలకపాత్ర పోషిస్తుంది. వారు ప్రేక్షకులతో ఎల్లవేళలా కనెక్ట్‌గా ఉండటానికి ఇది […]

Written By:
  • NARESH
  • , Updated On : August 18, 2022 / 10:55 PM IST
    Follow us on

    Instagram Top actors సినీ ఇండస్ట్రీలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతో ముఖ్యం. ఎంత మంది ఫాలోవర్స్ ఉంటే అంత క్రేజ్. ఈ సోషల్ మీడియాలో అకౌంట్స్ ద్వారా సినీ స్టార్స్ సినిమా ప్రకటనలు చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటారు. చిత్రాలను ప్రమోట్ చేసుకుంటారు. కొత్త చిత్రాలను పంచుకుంటారు. పెద్ద బ్రాండ్ డీల్‌లను దీనిద్వారానే ప్రమోట్ చేసి డబ్బులు సంపాదిస్తారు. అందుకే సోషల్ మీడియా ప్రముఖుల జీవితంలో కీలకపాత్ర పోషిస్తుంది. వారు ప్రేక్షకులతో ఎల్లవేళలా కనెక్ట్‌గా ఉండటానికి ఇది ఏకైక మార్గం. ప్రధానంగా తెలుగు స్టార్ హీరోలు అల్లు అర్జున్ ఇప్పుడు పాన్-ఇండియా నటుడు.. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న నటులలో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. తరువాత స్థానంలో విజయ్ దేవరకొండ నిలిచాడు.

    ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లను కలిగి ఉన్న దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ నటులలో బన్నీ మొదటి స్థానంలో నిలిచారు. తమిళ అగ్రహీరోలు విజయ్, అజిత్ వంటి తమిళ నటులు సోషల్ మీడియాలో అధికారికంగా లేకపోవడంతో జాబితాలోకి రాలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్ 8 అత్యంత ప్రజాదరణ పొందిన సౌత్ స్టార్‌ హీరోలు వీరే..

    -అల్లు అర్జున్ – 18.8 మిలియన్ ఫాలోవర్స్
    లాక్డౌన్ తర్వాత థియేటర్లు తిరిగి తెరవబడినప్పుడు అల్లు అర్జున్ పుష్ప: ది రైజ్ ప్రేక్షకులను సినిమా హాళ్లకు తిరిగి తీసుకువచ్చింది. సౌత్ స్టేట్స్‌లోనే కాకుండా నార్త్ మార్కెట్‌లోనూ ఈ సినిమా అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. పాన్-ఇండియాలో లెవల్ లో బన్నీ ప్రజాదరణ పొందాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతని అభిమానుల ఫాలోయింగ్ ఒక్కసారిగా దూసుకుపోయింది. సోషల్ మీడియాలో బన్నీ యాక్టివ్ గానే ఉంటాడు.

    -మహేష్ బాబు – 8.7 మిలియన్ ఫాలోవర్స్
    సూపర్ స్టార్ మహేష్ బాబు ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ నిండా అతని కుటుంబ ఫొటోలే ఉన్నాయి. కానీ మహేష్ కు భారీ అభిమానులున్నపారు. ప్రజాదరణ ప్రతి రోజు గడిచేకొద్దీ కుప్పలుగా పెరుగుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే విషయానికి వస్తే మహేష్ బాబు అప్పుడప్పుడు లేదా సెలవుల్లో ఉన్నప్పుడు పోస్టులు చేస్తుంటాడు. తన సినిమాల విడుదల సమయంలో కూడా మహేష్ బాబు వాటిని ప్రమోట్ చేయడానికి దీన్ని వాడడు.

    -రామ్ చరణ్ – 8.2 మిలియన్ ఫాలోవర్స్
    ఆర్ఆర్ఆర్ నటుడు రామ్ చరణ్ 2019లో ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టాడు. అతను ఫోటో-షేరింగ్ యాప్‌లో అరంగేట్రం చేసిన 12 గంటల్లోనే 137,000 మంది ఫాలోవర్స్ ను సంపాదించాడు. సోషల్ మీడియాలో రాంచరణ్ పెద్దగా యాక్టివ్‌గా లేడు. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నటులలో రాంచరణ్ ఒకడు. కానీ అతను ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండడు. అభిమానులతో సన్నిహితంగా ఉండాల్సిన అవసరం ఉంది.

    -జూనియర్ ఎన్టీఆర్- 4.5M ఫాలోవర్స్
    జూనియర్ ఎన్టీఆర్ తనని తాను మీడియాకు, సోషల్ మీడియా నుండి దూరంగా ఉండడానికి ఇష్టపడతాడు. అతను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడు. అయినప్పటికీ ఆర్ఆర్ఆర్ నటుడు ఉత్తర భారతంలో కూడా బాగా ప్రాచుర్యం పొందాడు.

    -విజయ్ దేవరకొండ – 16.9 మిలియన్ ఫాలోవర్లు
    విజయ్ దేవరకొండ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన మొదటి పాన్-ఇండియా చిత్రం లైగర్ ప్రమోషన్స్ కోసం సిద్ధమయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో అల్లు అర్జున్ తర్వాత సౌత్ ఇండియన్ సెలెబ్రెటీలలో విజయ్ రెండోవాడు. ఇన్ స్టాగ్రామ్ లో 301 పోస్ట్‌లతో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా విజయ్ ఉంటాడని స్పష్టంగా గెలుస్తోంది.

    -ప్రభాస్ – 8.6 మిలియన్ ఫాలోవర్స్
    సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా లేకపోయినా.. బాహుబలి ప్రభాస్ కు మంచి సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకోగలిగాడు. అతను తన సినిమాలను ప్రమోట్ చేయడానికి, పరిశ్రమలోని తన సన్నిహితుల పుట్టినరోజులకు, సామాజిక కారణాలకు మద్దతు ఇవ్వడానికి మాత్రమే సోషల్ మీడియాను ఉపయోగిస్తాడు. ప్రస్తుతం ఆదిపురుష్, సలార్‌తో సహా 4 పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

    -యష్- 11 మిలియన్ ఫాలోవర్స్
    అల్లు అర్జున్ మరియు విజయ్ దేవరకొండ తర్వాత అత్యధికంగా ఫాలో అవుతున్న సౌత్ నటుడు యష్. ఈయన ఇన్ స్టాగ్రామ్ లో 3వ స్థానంలో ఉన్నాడు. తన సోషల్ మీడియాలో ఏదైనా అప్‌లోడ్ చేసే విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉంటాడు. అతని పోస్ట్‌లలో ఎక్కువ భాగం కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలు.. వీడియోలే. KGF 2 ప్రమోషన్ల సమయంలో అతని సోషల్ మీడియా బాగా ఉపయోగించుకున్నాడు.

    -దుల్కర్ సల్మాన్ – 11 మిలియన్ ఫాలోవర్స్
    మాలీవుడ్ హార్ట్‌త్రోబ్ దుల్కర్ సల్మాన్ ఇన్ స్టాగ్రామ్ లో అత్యధికంగా ఫాలో అవుతున్న దక్షిణాది యువ ప్రముఖులలో 3వ స్థానంలో నిలిచాడు. అతని భార్య అమల్ సుఫియా మరియు కుమార్తెతో అతని వెకేషన్ ఫోటోలు టైమ్‌లైన్‌లో హైలైట్ గా ఉన్నారు. అలాగే, తన చిత్రాలను ప్రమోట్ చేయడానికి ఇన్ స్టాగ్రామ్ వాడుతాడు. ఆయన తాజా చిత్రం సీతా రామం కూడా ప్రమోషన్ చేసుకోలేదు. కేజీఎప్ స్టార్ యష్ వలె ఫ్యామిలీ పోస్టులకే పరిమితమవుతాడు.

    ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ లో సౌత్ ఇండియాలోనే అల్లు అర్జున్ టాప్ 1 లో ఉండగా.. విజయ్ దేవరకొండ టాప్ 2లో ఉన్నాడు. మిగతా హీరోలకు అందనంత ఫాలోవర్స్ తో ఈ ఇద్దరు కొనసాగుతున్నారు.