Vikram – Kamal Hasan : గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై తెలుగు మరియు తమిళం బాషలలో సంచలన విజయం సాధించిన చిత్రం ‘విక్రమ్’.చాలా కాలం నుండి సరైన హిట్టు లేకుండా ఇబ్బంది పడుతున్న కమల్ హాసన్ కి మరోసారి పూర్వ వైభవం తెచ్చిపెట్టింది ఈ సినిమా.సుమారుగా 450 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సౌత్ ఇండియన్ టాప్ 5 హైయెస్ట్ గ్రాస్ సాధించిన సినిమాలలో ఒకటిగా నిల్చింది.
ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్ర కంటే ఎక్కువ స్క్రీన్ టైం ఉన్న పాత్ర ‘అమర్’.ప్రముఖ మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ఈ పాత్ర పోషించాడు.కమల్ హాసన్ కి ఈ సినిమా ద్వారా ఎంత పేరు వచ్చిందో, అమర్ పాత్రకి కూడా అంతే పేరు వచ్చింది.అయితే ఈ క్యారక్టర్ ని తొలుత ఫహద్ ఫాజిల్’ తో కాకుండా టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తో చేయిద్దాం అనుకున్నాడట డైరెక్టర్ లోకేష్ కనకరాజ్.
లోకేష్ కనకరాజ్ తో సందీప్ కిషన్ కి మొదటి నుండి మంచి సాన్నిహిత్యం ఉంది, ఎందుకంటే లోకేష్ కనకరాజ్ మొదటి సినిమా ‘నగరం’ లో హీరో సందీప్ కిషన్ కాబట్టి.అందుకే తన కెరీర్ కి ఈ క్యారక్టర్ ఎంతో ఉపయోగపడుతుందని భావించిన లోకేష్ సందీప్ కిషన్ ని నటింపజెయ్యడానికి ప్రయత్నం చేసాడట.కానీ ఎందుకో ఆయన ఈ క్యారక్టర్ చెయ్యలేదు.ఒకవేళ చేసి ఉంటే సందీప్ కిషన్ కెరీర్ మరో లెవెల్ కి వెళ్లి ఉండేది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఎందుకంటే ఆయన కెరీర్ లో ‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమా మినహా మరో సూపర్ హిట్ లేదు.చేసిన సినిమాలన్నీ కూడా ఒకదానిని మించి ఒకటి అట్టర్ ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి.ఎన్నో భారీ ఆశలతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రీసెంట్ గా హీరో గా నటించిన ‘మైఖేల్’ చిత్రం కూడా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.అలా వరుసగా ఫ్లాప్స్ ని ఎదురుకునే బదులు ఇలాంటి విలువైన పాత్రలు చేస్తే కెరీర్ మరోలా ఉండేది కదా అని ఆయనని అభిమానించే వాళ్ళు చెప్తున్న మాట.