Tollywood Secrets : నటన అంటే పరకాయ ప్రవేశం చేయడం.. ప్రేక్షకులను రంజింప చేయడం.. దీనికోసం ముఖంలో హావాభావాలు పలికితే చాలు.. కానీ నటన పేరుతో అదే పనిగా తాకాల్సిన అవసరం లేదు. మొహంతో శరీర భాగాలను తడమాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ ఇప్పుడు నటన కంటే తాకడం ఎక్కువైపోయింది. తడిమి చూడటం మోతాదు మించిపోయింది. మేల్ డామినేషన్ ఇండస్ట్రీ కదా! ఏదైనా చెల్లుబాటు అవుతున్నది. అడిగేవాడు ఎవడు? అడ్డుకునే వాడు ఎవడు?
బుద్ది మారదా?
ఆడదంటే కన్ను కొట్టాలి.. లేదా కడుపు చేయాలి.. అంతే సింపుల్.. అంటాడు ఓ నెత్తి మాసిన హీరో. పైగా ఇతని వ్యాఖ్యలకు ముసి ముసి నవ్వులు నవ్వే ఇండస్ట్రీ పెద్దలు. అంటే ఈ తతంగం మొత్తం అందరికీ తెలిసే కదా జరుగుతోంది.. మరి దీనికి ముక్తాయింపులు దేనికి? నటన అంటే కచ్చితంగా కమిట్మెంట్ ఇవ్వాల్సిందేనా.. కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు ఇస్తారా? అలాంటప్పుడు అది ఇండస్ట్రీ ఎలా అవుతుంది? కళామతల్లికి సేవ ఎలా అవుతుంది? ఇండస్ట్రీలో మేము దైవంశ సంభూతులమని చెప్పుకునే హీరోలు, దర్శకులు, నిర్మాతలు దీనిని ఎలా సమర్థించుకుంటారు?
నడుము పట్టుకోవద్దని చెప్పడం పాపమయింది
డింపుల్ మమత అని… ఓ ప్రైవేట్ సాంగ్స్ లో నటించే డాన్సర్ ఉంది.. నెమలి నాట్యం చేసినట్టే ఆడుతుంది.. పాటకు తగ్గట్టుగా హావా భావాలు పలికిస్తుంది. తెలంగాణ జాన పదాలకు కొత్త అర్థం వచ్చేలా డ్యాన్స్ చేస్తుంది. ఈమె పాటలకు మిలియన్స్ లో వ్యూస్ వస్తాయి. పైగా సంప్రదాయ కుటుంబానికి వచ్చిన అమ్మాయి కావడంతో మొదటి నుంచి కొన్ని కట్టుబాట్లు విధించుకుంది. అంతేకాదు ఎవరినైనా కూడా అన్నా అని పిలుస్తుంది. కానీ చేయడమే ఆమె పాలిట శాపం అయింది.. పైగా తన నడుము పట్టుకుని డాన్స్ చేస్తా అని ఓ నెత్తి మాసిన డాన్సర్ కోరడంతో ఆమె తిరస్కరించింది. ఇక అప్పటినుంచి ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. కాదు ఒకప్పుడు ఊపిరి తీసుకునేందుకు కూడా ఖాళీ లేని ఆమె ఇవ్వాళా అవకాశాలు లేకుండా దిగాలుగా చూస్తోంది.. ఇందుకు కారణం ఆమె దానికి ఒప్పుకోకపోవడమే..
అవకాశాల పేరుతో..
సినిమా పరిశ్రమ అనేది అవకాశాల గని లాంటిది.. ఇది బలవంతమైన మాధ్యమం కావడంతో సాధారణంగా టాలెంట్ ఉన్న యువత ఇండస్ట్రీలోకి వచ్చి తమ ప్రతిభ నిరూపించుకోవాలని అనుకుంటారు. సెలబ్రిటీ హోదా అనుభవించాలని కోరుకుంటారు. దీనినే అలుసుగా తీసుకొని సినిమా పెద్దలు అవకాశాలు ఇస్తామని చెప్పి అవసరాలు తీర్చుకుంటున్నారు.. పైగా దీనికి కమిట్మెంట్ అనే పేరు కూడా పెట్టారు. దీనిని సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు. కోట్లకు కోట్లు పెట్టుబడి పెట్టిన వాళ్ళు కోరిక కోరతే తప్పేంటని వెనకేసుకోస్తున్నారు కూడా..