https://oktelugu.com/

Dil Raju-Nitin: బీఆర్‌ఎస్‌ నుంచి దిల్‌ రాజు, బీజేపీ నుంచి నితిన్‌: తెలంగాణ ఎన్నికల్లో సినీ దిగ్గజాలు

Dil Raju-Nitin: ఆ మధ్య కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హీరో నితిన్‌ను కలిశారు. మొన్న బలగం సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సిరిసిల్లలో జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. వీటి గురించి కూపీ లాగితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నితిన్‌, దిల్‌ రాజు పొలిటికల్‌ ఇంట్రస్ట్‌లు బయటకు వచ్చాయి. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం… ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో సినీ గ్లామర్‌ యాడ్‌ అవబోతోంది తెలంగాణలో సినీరంగం […]

Written By:
  • Rocky
  • , Updated On : March 5, 2023 / 10:07 AM IST
    Follow us on

    Dil Raju – Nitin

    Dil Raju-Nitin: ఆ మధ్య కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హీరో నితిన్‌ను కలిశారు. మొన్న బలగం సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సిరిసిల్లలో జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. వీటి గురించి కూపీ లాగితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నితిన్‌, దిల్‌ రాజు పొలిటికల్‌ ఇంట్రస్ట్‌లు బయటకు వచ్చాయి. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం… ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో సినీ గ్లామర్‌ యాడ్‌ అవబోతోంది తెలంగాణలో సినీరంగం నుంచి విజయశాంతి, బాబూ మోహన్‌ మాత్రమే ఎన్నికల బరిలో నిలిచారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అయితే ఒక్క బాబూ మోహన్‌ మాత్రమే పోటీ చేశారు. ఈసారి, వీరికి చాలా మంది తోడు కానున్నారు. సినీ నిర్మాతలు దిల్‌ రాజు, రామ్‌ తాళ్లూరి, దర్శకుడు శంకర్‌, సినీ నటులు నితిన్‌, జీవిత, కత్తి కార్తీక ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే వీరిలో ప్రముఖ నిర్మాత, డిస్ర్టిబ్యూటర్‌ దిల్‌ రాజు అధికార బీఆర్‌ఎస్‌ నుంచి బరిలోకి దిగే అవకాశాలున్నాయని సమాచారం. నిజామాబాద్‌ జిల్లా నర్సింగ్‌పల్లికి చెందిన ఆయన.. ఎంపీగా కానీ, ఎమ్మెల్యేగా కానీ బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నారు. ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిగాయి. దిల్‌ రాజుకు టికెట్‌ ఇప్పించే బాధ్యత మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీసుకున్నారు.

    కర్ణాటకు నుంచా లేదా తెలంగాణ నుంచా?

    కన్నడ మూలాలు ఉన్న ప్రకా్‌షరాజ్‌ కూడా కేసీఆర్‌కు సన్నిహితంగా ఉంటున్నారు. బీఆర్‌ఎ్‌స కార్యకలపాల్లో పాలు పంచుకుంటున్నారు. గతంలో ఆయన హైదరాబాద్‌ నగరంలోని ఒక స్థానం నుంచి పోటీ చేయాలని భావించినా అది కార్యరూపం దాల్చలేదు. ఇక ఇటీవల ప్రకాష్‌ రాజ్‌ సీఎం కేసీఆర్‌ను ఫామ్‌హౌ్‌సలో కలిసి చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే, ఆయన తెలంగాణ నుంచా లేదా బీఆర్‌ఎస్‌ తరఫున కర్ణాటకలో ఎక్కడి నుంచైనా బరిలోకి దిగుతారా అనేది తేలాల్సి ఉంది మిర్యాలగూడ నియోజక వర్గానికి చెందిన దర్శకుడు ఎన్‌.శంకర్‌ కూడా బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. 2014 ఎన్నికల్లోనే ఆయనకు కాంగ్రెస్‌ మిర్యాలగూడ టికెట్‌ ఇస్తామన్నప్పటికీ సుముఖత చూపలేదు. బీఆర్‌ఎస్‌ తరఫున పోటీకే ఆసక్తి చూపుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూడా ఆయనకు అధికార పార్టీలో ఏదైనా ఒక కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. జైబోలో తెలంగాణ సినిమాలోనే హీరోగా నటించిన రోషన్‌ బాలు కూడా ఈసారి బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. ఈయన కూడా గత ఎన్నికల్లో ముషీరాబాద్‌ నుంచి టికెట్‌ ఆశించారు. కానీ, దక్కలేదు.

    Also Read: Harman Preet -Yuvraj : అప్పుడు యువి…ఇప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్.. ఆ ఘనతలు వీరికే సొంతం

    నితిన్‌పై బీజేపీ దృష్టి

    తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ నితిన్‌పై దృష్టి పెట్టింది. ఆయనను రంగంలోకి దించే అవకాశాలను పరిశీలిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కూడా నితిన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక విజయశాంతి బీజేపీ నుంచి బరిలోకి దిగనున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమె.. గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. విజయశాంతి జహీరాబాద్‌ అసెంబ్లీ స్థానాన్ని అడుగుతున్నారు. ఇక, బాబూ మోహన్‌ తన నియోజకవర్గం ఆందోళ్‌ నుంచి బరిలో దిగనున్నారు. ఇక బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, టీవీ ఆర్టిస్ట్‌ కత్తి కార్తీక కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. దుబ్బాక నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఈసారి తెలంగాణలో పోటీ చేయనున్న జనసేన తరఫున కూడా ఒకరిద్దరు సినీ రంగానికి చెందినవారు బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఖమ్మం జిల్లాకు రామ్‌ తాళ్లూరి జనసేన పార్టీలో ఉన్నారు. ఆయన పార్లమెంట్‌ లేదా అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

    Also Read: Hats off to Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రాష్ట్రంపై ప్రేమ రాజకీయాల కతీతం