Chiranjeevi : దేశంలోనే పవర్ ఫుల్ వ్యక్తి అయిన ప్రధాని మోడీ స్వయంగా కొనియాడారు. కానీ తెలుగుసినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన మేరునగ ధీరుడిని మాత్రం తెలుగు సినీ పరిశ్రమ పెడచెవిన పెడుతోంది. కనీసం టాలవుడ్ కు ఇంత చేసిన ఆయనకు ట్విటర్ లో అభినందనలు.. కలిసి పుష్ప గుచ్ఛాలు అందించిన పాపాన పోలేదు. ‘నంది’ లాంటి రాష్ట్ర అవార్డులు ఇస్తేనే.. లేక జగన్ పిలిచి సలహాదారులు, ఫిల్మ్ కార్పొరేషన్ అవార్డులు, ఎస్వీబీసీ చైర్మన్ ను చేస్తేనే ఆ కళాకారుడికి ఎదురెళ్లి మరీ స్వాగతం చెప్పే ఈ సినీ జనాలు.. మెగస్టార్ చిరంజీవికి దేశంలోనే ప్రతిష్టాత్మక అవార్డును ఇస్తే నోరు మెదపకపోవడమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చిరంజీవిపై ఎందుకంత పగ, ఎందుకు ఆయనను తొక్కేస్తున్నారు. కనీసం మీడియాలో కూడా ఆయన గురించి రాయడం లేదు. కవర్ చేయడం లేదు. ఇదంతా చూస్తుంటే ఒక పకడ్బందీగా మెగా స్టార్ ప్రతిభను తొక్కేసే కుట్ర జరుగుతోందని అర్థమవుతోంది.
-చిరంజీవి.. ఓ స్వయంకృషి.. ఓ నిస్వార్థ సేవకుడు
చిరంజీవి స్వయంకృషితో అత్యున్నత శిఖరాలు అధిరోహించిన కార్యసాధకుడతను. మెగాస్టార్ గా ఎదిగాక కూడా ఇండస్ట్రీ కష్టాలు, నష్టాల్లో ‘నేనున్నాను’ అంటూ నిలబడ్డాడు. కరోనా సమయంలో షూటింగ్ లు బంద్ అయ్యి ఆకలితో అలమటిస్తున్న సినీ కార్మికులు, చిన్న నటీనటులను చిరంజీవి ఆదుకున్నాడు. స్వయంగా కోట్ల డబ్బు ఖర్చు పెట్టి వారి ఆకలి తీర్చాడు. అవసరాలు తీర్చాడు. ఇక ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం నుంచి ‘టికెటింగ్’ సహా పలు సమస్యలు ఎదురైనప్పుడు నేనున్నానంటూ స్వయంగా జగన్ వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరించాడు. ఆ తర్వాత టాలీవుడ్ హీరోలు , దర్శకులను తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేశాడు. ఇదే కాదు.. సినీ కళాకారులు, ప్రజల కోసం బ్లడ్ బ్యాంక్, ఐబ్యాంక్ సహా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి కోట్లు ఖర్చు చేసిన మహా మనిషి చిరంజీవి. అందుకే మోడీ ఏపీకి వచ్చినా మన చిరంజీవిని ఆహ్వానించి ఆయనను గౌరవించాడు. అల్లూరి విగ్రహావిష్కరణకు స్వయంగా పిలిచాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రతిషాత్మక అవార్డును అందజేశారు.
-చిరంజీవికి కేంద్రం ప్రతిష్టాత్మక అవార్డు
టాలీవుడ్ మెగాస్టర్ చిరంజీవి కీర్తికిరీటంలో మరో ప్రతిష్టాత్మక అవార్డ్ చేరింది. చిరంజీవిని ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ -2022’ అవార్డ్ వరించింది. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) చలనచిత్రోత్సవం గోవాలో జరుగబోతోంది. ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి ఈ పురస్కారాన్ని ప్రధానం చేస్తుంది. చిరంజీవి తన 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 150కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయనకు ఈ అవార్డ్ ఇవ్వడంపై కేంద్ర ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హర్షం వ్యక్తం చేసింది.
-చిరంజీవిపై చిన్నచూపేలా?
స్వయంగా ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ నుంచి సైతం చిరంజీవీని పొగడ్తలతో ముంచెత్తుతుంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి స్పందన కొరవడడం ఆశ్చర్యకరం అని చెప్పొచ్చు. ఇదే వేరొకరైతే ఊదరగొడుతూ ఉండేవి తెలుగు మీడియా మైకులు,పెన్నులు. తమ కులపు హీరో అయితే బాక్సులు బద్దలయ్యేలా ప్రచారం చేసుకునేవి. టాలీవుడ్ లోనూ కులాల లెక్కన విభజన రేఖ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని అగ్రకులాల పెత్తనం ఆది నుంచి నడుస్తోంది. వారి చేతుల్లోనే బలమైన మీడియా ఉంది. ఇదే తమ వర్గం హీరోకు ఈ అవార్డ్ వస్తే చానెల్స్ అన్నీ ఇల్లు పీకి పందేరేసి డిబేట్లతో వేయినోళ్ల పొగిడేవి. కానీ టాలీవుడ్ కు ఎంతో సేవ చేసిన చిరంజీవికి ఈ అవార్డ్ వచ్చినా ఆ చానెల్స్ అన్నీ కిమ్మనకుండా ఉన్నాయి. చిరంజీవి ఖ్యాతిని గుర్తించడానికి వాటికి అహం అడ్డు వస్తున్నాయి. అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలేవు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు.. ప్రజల గుండెల్లో ఒక నటుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగిన చిరంజీవి ప్రభను కూడా ఎవరూ ఆపలేరు. ఇలాంటివెన్నో అవార్డులు ఆయన పాదాక్రంతం అయినా ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, మీడియా ఎప్పుడు కళ్లు తెరుస్తుందో వాళ్లకే తెలియాలి. కళ్లు ఉండి చూడలేని ధృతరాష్ట్రుడి మిగిలిపోతుందా వేచిచూడాలి.
Chiranjeevi Garu is remarkable. His rich work, diverse roles and wonderful nature have endeared him to film lovers across generations. Congratulations to him on being conferred the Indian Film Personality of the Year at @IFFIGoa. @KChiruTweets https://t.co/yQJsWL4YhG
— Narendra Modi (@narendramodi) November 21, 2022